అజీర్ణం ఎంతో చికాకు కలిగిస్తుంది. త్రేన్పులు పై నుండి, గ్యాస్ మలద్వారం నుండి పోతూవుంటుంది. ఒకొక్కపుడు బయటకు పోకుండా తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. దీనికి కారణం….అనారోగ్యకర పదార్ధాలు విచ్చలవిడిగా తినేయడమే. వీటి కారణంగా పొట్టలో యాసిడ్ తయారై పొట్టనుండా పైభాగానికి ప్రవహించి కొన్ని సార్లు గుండెమంట కూడా కలిగిస్తుంది. మరి ఈ అజీర్ణం కలిగించే పదార్ధాలు ఏమిటో తెలుసుకోండి. – నూనెలు, కొవ్వులు అధికంగా వుండే పదార్ధాలు అజీర్ణం కలిగించి పొట్టలో గ్యాస్ పుట్టిస్తాయి.
పొట్టలోని నూనె నిల్వలు యాసిడ్ అధికం చేస్తాయి. బర్జర్లు, ఫ్రెంచి ఫ్రై, పొటాటో చిప్స్, పకోడాలు, బటర్ కుకీలు, గ్రిల్ మీట్ లేదా స్నాక్స్ వంటివి తినకండి. – మసాలాలు బాగా దట్టించిన పదార్ధాలు కూడా అజీర్ణం గ్యాస్ కలిగిస్తాయి. ఛాట్ మసాలా, చిల్లి పౌడర్ వంటివి వాడిన పదార్ధాలు గుండె నొప్పి వరకు సమస్యలిస్తాయి. – కేబేజి, ముల్లంగా వంటివి ఆరోగ్య కరమైనా, అజీర్ణం, గ్యాసు పుట్టిస్తాయి. వీటిని బాగా ఉడికించాలి. అపుడు అజీర్ణం కలిగించకుండా వుంటాయి. – తరచుగా మీరు తాగే కాఫీ, టీలు కూడా గ్యాస్ పుట్టించి గుండెమంట కలిగిస్తాయి. ప్రత్యేకించి ఖాళీ కడుపుతో వీటిని తాగకండి.
కూల్ డ్రింకులు, సోడాలు పొట్టను వాటిలోని గాలితో నింపి గ్యాస్ పుట్టిస్తాయి. డైరీ ఉత్పత్తులలో పాలు అజీర్ణం తేలికగా కలిగిస్తాయి. – పప్పులు కూడా అజీర్ణం కలిగిస్తాయి. మీ పొట్ట కనుక వీటిని జీర్ణం చేసుకోలేకుంటే, వీటిని తినటం మానండి. అన్నిటికి మించి ప్రతిదినం శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవటం కూడా అజీర్ణానికి దోవతీసే అవకాశం వుంది. కనుక ఆరోగ్యకర ఆహారాలు తీసుకుంటూ తగినంత వ్యాయామం ప్రతిదినం చేయాలి.