పచ్చళ్ళ మీద పన్నులా? బహుశా ఏ దేశమూ విధించదు. మీరు బహుశా అడగాలనుకొనేది ఏదైనా అపరాధ రుసుము (పెనాల్టీ) వంటిది వుంటుందా అని. నా అనుభవంలో వచ్చింది చెబుతాను.
అమెరికాలోకి పళ్ళు, కాయగూరలు, గింజలు, మొక్కల వంటివి అనుమతించరు. వాటి గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు తప్పని సరిగా మన passport స్టాంప్ చేసే ముందు అడుగుతారు. అక్కడ లేదని చెప్పి తరువాత పట్టుబడితే భారీ మొత్తంలో పెనాల్టీ విధిస్తారు. మీరు ముందే తెలియ చేస్తే పెనాల్టీ నుంచి తప్పించు కోగలరు కానీ ఆ వస్తువులనయితే జప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటివి మీతో తీసుకు రాకపోవడం మంచిది.
ఎటువంటి పప్పులను అనుమతించరు. వేరుశనగ పప్పు పచ్చిది తీసుకు రాకూడదు. వేయించినదయితే పరవా లేదు అయినా తీసుకు రాకపోవడమే మంచదంటాను. చింతపండు లో గింజ లేకుండా చూసుకోవాలి. ధనియాలు, మెంతులు, మిరపకాయల వంటి మసాలాలు తీసుకు రావచ్చు కాని ప్యాకింగ్ లో వుండేలా చూసుకోండి.
వడియాలు, అప్పడాలు, ఇతర తినుబండారాలకి అభ్యంతరం వుండదు. పచ్చళ్ళు,అవకాయల వంటి వాటిలో నూనె తక్కువగా వుంచి, మంచి ప్యాకింగ్ లో తీసుకు రావడం మేలు. లేదంటే నూనె బయటకు వచ్చి మన బ్యాగులు మొత్తం పాడయ్యే ప్రమాదం వుంది. మన సౌకర్యం గురించే తప్ప వాళ్ళకి అభ్యంతరం లేదు.
అయినా అమెరికాలో అడుగడుగునా భారతీయ దుకాణాలున్నాయి. మన దేశంలో నయినా వెదుక్కోవాలేమో కానీ అక్కడ ఒక చోటే మనకు కావలసినవ్నీ దొరుకుతుంటాయ్. ధర మన దేశంతో పోల్చుకోవడమెందుకు సంపాదన మన దేశంలో కన్నా ఎన్నో రెట్లు ఎక్కువేగా!