Sugar : సాధారణంగా చాలా మంది రోజూ రకరకాల పదార్థాలను తింటుంటారు. భిన్న రుచులు ఉండే ఆహారాలను తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొందరు తీపి అంటే ఇష్ట పడితే కొందరికి కారం అంటే ఇష్టం ఉంటుంది. కొందరు పులుపు, ఇంకొందరు వగరు.. అంటే ఇష్టంగా తింటారు. అయితే తీపి అంటే ఇష్ట పడే వారే సహజంగా ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో వారు రోజూ తీపి లేదా చక్కెరతో తయారు చేసే పదార్థాలను తింటుంటారు. అయితే ఇలా తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల అనర్ధాలు సంభవిస్తాయి.
తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో పలు మార్పులు వస్తాయి. మన శరీరం కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. దీంతో మనం తీపి ఎక్కువగా తింటున్నామని అర్థం చేసుకోవాలి. ఇక ఆ లక్షణాలు ఏమిటంటే..
1. తీపి పదార్థాలను అధికంగా తింటుంటే.. ఇంకా తినాలపిస్తుంది. సాధారణ సమయంలోనూ తీపి పదార్థాలను తినాలని పదే పదే కోరిక పుడుతుంది. మీరు తీపి పదార్థాలను అధికంగా తింటున్నారని తెలియజేసే లక్షణాల్లో ఇదొకటి.
2. తీపి లేదా చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను అధికంగా తింటే చర్మం తన సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో చర్మంపై త్వరగా ముడతలు పడతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. చర్మం ముడతలుగా కనిపిస్తుంది.
3. తీపి పదార్థాలను అధికంగా తింటే దంతాలు కూడా నొప్పిగా అనిపిస్తాయి. దంత క్షయం ఏర్పడి అలా జరుగుతుంది. దంతాలు పుచ్చు పడతాయి.
4. తీపి పదార్థాలను అధికంగా తినే వారిలో ఎల్లప్పుడూ గ్యాస్ సమస్య ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆకలి ఉండదు. అజీర్ణ సమస్య వస్తుంది. ఎప్పుడూ తీపి పదార్థాలనే తినాలని అనిపిస్తుంటుంది.
5. తీపి పదార్థాలను ఎక్కువగా తింటే శరీరంలో వాపులు వస్తాయి. నీరు ఎక్కువగా చేరుతుంది. అధికంగా బరువు పెరుగుతుంటారు.
6. తీపి పదార్థాలను తినడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా తయారవుతుంది. ఇది పలు భాగాల్లో నిల్వ అవుతుంది. దీంతో పొట్ట, తొడలు, పిరుదుల వద్ద కొవ్వు చేరి అవి లావుగా కనిపిస్తాయి.
ఈ లక్షణాలు మీలో కనిపిస్తుంటే మీరు తీపి పదార్థాలను అధికంగా తింటున్నారని అర్థం. అందువల్ల వాటిని తినడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్ వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.