చలికాలం, వర్షాకాలం వంటి రుతువులు ఎన్నో వస్తాయి. కాలానికి తగ్గట్లు అనారోగ్యాలు కూడా కలుగుతూంటాయి. అయితే…. ఎప్పటికి జబ్బు పడకుండా జ్వరం, నొప్పులు, ఇన్ఫెక్షన్, దగ్గు జలుబు, అలసట మొదలైనవి రాకూడదంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. జబ్బు పడకూడదంటే… వ్యక్తిగత పరిశుభ్రత చాలా ప్రధానమైంది. చెమట లేని మంచి దుస్తులు, క్రిమి సంహారక సబ్బులు, మీ స్వంత దువ్వెనలు, బ్రష్ లు, వాడటం ప్రతిరోజూ స్నానం చేయడం, దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు శుభ్రం చేయటం, వాడేసిన వస్తువులు పారవేయడం వంటివి చేయాలి.
కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే, వారు ఉపయోగించే వస్తువులు వేరుగా వుంచమనండి. వేరు పడక, దుస్తులు వంటివి ఏర్పరచాలి. పిల్లలు అనారోగ్యంగా వుంటే, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, టిష్యూ వాడటం వంటివి చేయాలి. ఎంత తినాలనిపించినప్పటికి బజారులో దొరికే ఆహార పదార్ధాలు తినకండి. నీరు కూడా వేరే ప్రదేశాలది తాగకండి. సీలు వేసిన మినరల్ వంటివి వాడవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ లేదా లెమన్ టీ వంటివి తాగితే రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. ఆరోగ్యంగా వుంటారు.
రిలాక్స్ అయ్యే మార్గాలు ఆచరించండి. ఏ జబ్బునైనా సరే చక్కటి సంగీతం తగ్గించేస్తుంది. మీ కిష్టమైన పాటలు, ఇతర వాయిద్యాలు విని రిలాక్స్ అవండి. మంచి నిద్ర మిమ్మల్ని జబ్బులనుండి కాపాడుతుంది. మీ ప్రాంతంలో ఫ్లూ, లేదా వ్యాప్తి చెందే ఇతర జబ్బులు వుంటే, తక్షణమే వైద్యుల సలహా పొంది అవి రాకుండా తగిన మందులు వాడండి. మీ ప్రాంతంలో ఇతరులకు కూడా తగిన సలహా నిచ్చి వ్యాప్తి చెందే రోగాలకు దూరంగా వుండండి.