చెమట పట్టకుండా రోజువారీ దిన చర్యలోనే బరువు తగ్గించే కొన్ని సులభ మార్గాలు పరిశీలించండి. విటమిన్ డి తక్కువైతే బరువు తగ్గటం కష్టం. కనుక ప్రతిరోజూ 2,000 మిల్లీగ్రాముల విటమిన్ డి తీసుకోండి. రాత్రులందు నిద్ర 4 గంటలకంటే తక్కువుంటే జీవప్రక్రియ తగ్గుతుంది. కనుక 7 నుండి 8 గంటలు తప్పక నిద్రించండి. ఇంటిపనిలో కేలరీలు బాగానే ఖర్చవుతాయి. పనివారిపై ఆధారపడేకంటే, మీకు మీరు గిన్నెలవంటివి శుభ్రం చేసుకుంటూ శ్రమించండి.
నవ్వాలనుకుంటున్నారా? రోజులో ఎక్కువసార్లు హాయిగా పెద్దగా నవ్వేయండి. 10 నుండి 15 నిమిషాలు నవ్వేస్తూ వుంటే 50 కేలరీలు రోజుకు ఖర్చవుతాయి. జీవప్రక్రియ పెరగాలంటే రోజూ 8 గ్లాసుల నీరు తాగితే 30 శాతం పెరుగుతుంది. కనుక శరీరంలో తగినంత నీరు వుండేలా చూడండి.
చిన్నపాటి నడక అయినా సరే వేగంగా నడవండి. చాలా బిజీగా నడవటం, విశ్రాంతిలేకుండా తిరిగేస్తూ వుండటం వంటివి రోజుకు కనీసం 350 కేలరీలు ఖర్చు చేస్తాయి. కనుక రోజూ చేసే ఈ పనులను ఆచరించి తేలికగా బరువు తగ్గండి.