Edema : మనకు సహజంగానే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు శరీరం పలు సూచనలు తెలియజేస్తుంది. పలు లక్షణాలను బయటకు చూపిస్తుంది. దీంతో మనం జాగ్రత్తపడి డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మనకు వచ్చిన వ్యాధికి అనుగుణంగా చికిత్స తీసుకుంటాం. కానీ కొందరు ఈ లక్షణాలను గమనించరు. దీంతో అవి ఇతర సమస్యలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు, చేతులు.. వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
మన శరీరంలో ముఖం, కాళ్లు, చేతుల్లో వాపులు బాగా కనిపిస్తుంటే.. దాన్ని ఎడిమా అంటారు. శరీరంలో సోడియం ఎక్కువ కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడడం, నీళ్లను సరిగ్గా తాగకపోవడం, సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ముఖం, చేతులు, కాళ్లలో వాపులు వస్తాయి. ఆయా భాగాల్లో నీరు చేరి వాపులు కనిపిస్తుంటాయి.
నీళ్లను తక్కువగా తాగితే శరీరంలో ఉన్న సోడియం బయటకు పోకుండా పేరుకుపోతుంది. దీంతో ఆ సోడియం కిడ్నీల్లో చేరుతుంది. ఫలితంగా శరీరం మొత్తం వాపులకు గురై కనిపిస్తుంది. కనుక ఇలా వాపులు వచ్చినవారు వెంటనే జాగ్రత్త పడాలి. వీటిని తగ్గించుకునేందుకు ఒక అద్భుతమైన చిట్కా పనిచేస్తుంది. అందుకు ఏం చేయాలంటే..
రెండు గ్లాసుల నీళ్లను తీసుకుని అందులో అర కప్పు ధనియాలు వేసి మరిగించాలి. నీళ్లు గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. అనంతరం వచ్చే కషాయాన్ని తాగాలి. ఇలా రోజూ పరగడుపునే తాగుతుండాలి. దీంతో శరీరంలో ఉన్నవాపులు తొలగిపోతాయి. వరుసగా 3 రోజుల పాటు ఈ కషాయాన్ని తాగితే చాలా వరకు వాపులు తగ్గిపోతాయి. ఇంకో 3 రోజుల పాటు ఈ కషాయాన్ని మళ్లీ తీసుకుంటే సమస్య మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది.
ఇక వాపుల సమస్య ఉన్నవారు రోజువారి ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. దీంతో వాపులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
ఈ విధంగా ధనియాలతో కషాయం చేసి తాగడం వల్ల పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ధనియాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ ధనియాల కషాయాన్ని రోజూ తాగాలి. నెలసరి సమయంలో మహిళలు దీన్ని తాగితే అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక వాపులు తగ్గాలనుకునేవారు.. రోజూ ఒక బకెట్ నీటిలో కొద్దిగా హిమాలయన్ సాల్ట్ వేసి బాగా కలిపి అందులో పాదాలను 20 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. వాపులు తగ్గిపోతాయి. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే వాపులను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.