లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు.అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ.
ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర చేసిన జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయింది. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా విలన్ పాత్రలో నటించి.. సినిమాకే హైలెట్ గా నిలిచారు. పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే పాత్రలో సునీల్ నటించారు. అంతేకాదు.. అనసూయ భర్తగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎవరికీ తలవంచని పాత్రలో నటించాడు. అటు సునీల్ కూడా ఒకరి ముందు తలవంచడు.
సరిగ్గా ఇదే సమయంలో… మంగళం శ్రీను దగ్గరకు పుష్ప ఒక సీన్ లో వస్తాడు. అప్పుడు తన సిగరెట్ వెలిగించుకోవడానికి సునీల్ దగ్గరకు అగ్గి పుల్ల పట్టుకుని వస్తాడు పుష్ఫ. కానీ సునీల్ దగ్గర తల వంచకూడదని.. అగ్గి పుల్లను అంటించి.. అలాగే పట్టుకుంటాడు. ఇక అటు తన సిగరెట్ వెలిగించుకోవడానికి సునీ ల్ ప్రయత్నిస్తాడు. కానీ పుష్ఫ దగ్గర తలవంచకూడదని.. తన సిగరెట్ కు అగ్గిపుల్ల తగిలే.. వరకు వెయిట్ చేస్తా డు. ఈ సీన్ చూసిన.. ఫ్యాన్స్ కు గూస్ బమ్స్ వస్తాయి. కాగా.. పుష్ఫ 2 సినిమా కూడా పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే.