Mohan Babu : సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ తాజాగా విడుదలైంది. అయితే ఈ సినిమాకు తొలిరోజే థియేటర్లలో ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. అలాగే రివ్యూలు కూడా పూర్తిగా నెగెటివ్‌గా వచ్చాయి. ఇక అంత వరకు ఓకే అనుకుంటే.. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానల్స్‌లో ఈ సినిమాతోపాటు మంచు ఫ్యామిలీపై విపరీతమైన విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో వారందరిపై మంచు ఫ్యామిలీ పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఓ లెటర్ వైరల్ అవుతోంది. అందులో ఉన్న సారాంశం ప్రకారం.. తమను ట్రోల్ చేస్తూ, విమర్శిస్తున్న వారిపై మంచు ఫ్యామిలీ ఏకంగా రూ.10 కోట్ల మేర పరువు నష్టం దావా వేయనుందని తెలుస్తోంది. అయితే గతంలో మోహన్ బాబు తమపై వచ్చే ట్రోల్స్ మీద స్పందించారు. ఓ సందర్భంలో ఆయన వాటిని ఎంజాయ్ చేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్న వారిపై వారు లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీతోపాటు ఈ మధ్య కాలంలో మంచు విష్ణుకు బ్యాడ్ నేమ్ రావడం.. వంటివన్నీ.. ఈ ట్రోల్స్‌కు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారికంగా ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి.