Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శబరిమలలో ఉండే 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఉండే విశిష్టత ఏమిటో తెలుసా..?

Admin by Admin
October 5, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అయ్యప్ప మాలను ధరించిన వారందరూ శబరిమలను సందర్శించి అక్కడ మాలను తీసేసి ఆ క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని అందరికీ తెలిసిందే. అయితే కేవలం అయ్యప్ప స్వాములే కాదు చాలా మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. కాకపోతే ఆలయంలో ఉన్న 18 మెట్లపై నుంచి కేవలం అయ్యప్ప మాలను ధరించిన స్వాములకు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది సరే.. ఇంతకీ ఆ 18 మెట్ల గురించిన విషయాలు మీకు తెలుసా..? ఆ మెట్లలో ఒక్కో మెట్టు మనకు ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది. మరి ఆ మెట్ల గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా.

కామం – 1వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత గీతా మాత.ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వ జన్మ స్మృతి కలుగుతుంది. గత జన్మలో తాను చేసిన పాప పుణ్య కర్మల విచక్షణా జ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ది పొందుతాడు.

క్రోధం – 2వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత గంగా దేవి. ఈ మెట్టును స్పర్శించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగుతుంది. తన కోపమే తన శత్రువు. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు.

లోభం – 3వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత గాయత్రీ మాత. ఈ మెట్టును స్పర్శించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి. అవసరాలకంటే ఎక్కువ కావాలనుకునే బుద్ది. కీర్తి కోసం అత్యాశ, తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక. దురాశ దుఖాఃనికి చేటు.

ayyappa 18 steps do you know the meaning of them

మోహం – 4వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత సీతా దేవి. ఈ మెట్టు జ్ఞాన యోగానికి ప్రతీక. ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం, ప్రత్యేకించి ఒక వ్యక్తి పై ప్రేమ /అనుబంధం భావనకు ఈ మెట్టుకు గుర్తుగా విశ్వసిస్తారు.

మదం – 5వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత సత్యవతీ మాత. ఈ మెట్టు కర్మసన్యాసయోగానికి ప్రతీక. 4, 5 మెట్లు స్పర్శించిన గృహములో ఉన్న పశు-పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయి.

మాత్స్యర్యం – 6వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత సరస్వ‌తీ దేవి. ఈ మెట్టు స్పర్శల వలన విష్ణు సాయుజ్యం, సమస్త దాన ఫలం కలుగుతుంది. ఇతరుల సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ ఓర్వలేని బుద్ధి ఇది.

దంబం – 7వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత బ్రహ్మవిద్యా దేవి. ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞాన యోగాధ్యాయం కలిగి పునర్జన్మ కలగదు.

అహంకారం – 8వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత బ్రహ్మవల్లీ దేవి. ఈ మెట్టు స్పర్శ వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.

నేత్రములు – 9వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత త్రిసంధ్యా దేవి. ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగాతీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది.

చెవులు – 10వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత ముక్తిగేహినే దేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమ ధర్మ పుణ్య ఫలం, జ్ఞానం కలుగుతాయి.

నాసిక – 11వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత అర్ధమాత్రా దేవి. ఈ మెట్టు స్పర్శ వలన అకాల మృత్యు భయం ఉండదు.

జిహ్వ – 12వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత చిదానందా దేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది. దీనిని కఠోరంగా మాట్లాడడానికి ఉపయోగించకూడదు.

స్పర్శ – 13వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత భవఘ్నీ దేవి. ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార, మద్య, మాంసభక్షణ, పాపాలు నశిస్తాయి. స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ.

సత్వం – 14వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత భయనాశినీ దేవి. ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీ హత్యా పాతకాలు నశిస్తాయి.

తామసం – 15వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత వేదత్రయూ దేవి. ఈ మెట్టు స్పర్శ వలన ఆహారశుద్ధి, మోక్షం,కలుగుతాయి.

రాజసం – 16వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత పరా దేవి. ఈ మెట్టు స్పర్శ వలన దేహ సుఖం, బలం లభిస్తాయి.

విద్య – 17వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత అనంతాదేవి. ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి.

అవిద్య – 18వ మెట్టు

ఈ మెట్టుకు అధి దేవత జ్ఞానమంజరీదేవి. ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి.

8 మెట్ల ప్రాధాన్యత హిందూ వేదాంతం ప్రకారము 18 వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. అయ్యప్ప 18 ఆయుధాలతో చెడును సంహ‌రిస్తాడు.

Tags: ayyappa 18 steps
Previous Post

Tooth Pick : టూత్‌పిక్ పైభాగంలో చెక్కిన‌ట్లు ఆకారం ఉంటుంది ? అది ఎందుకో తెలుసా ?

Next Post

మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయా..అయితే ఈ ఫుడ్స్‌ని అస‌లు తిన‌కూడ‌దు..!

Related Posts

Off Beat

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

July 20, 2025
ఆధ్యాత్మికం

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

July 20, 2025
mythology

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

July 20, 2025
హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.