ఆధ్యాత్మికం

Deeparadhana : మీ పుట్టిన తేదీని బట్టి మీ ఇష్టదైవానికి ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలో తెలుసుకోండి..!

Deeparadhana : హిందూ సాంప్ర‌దాయంలో దేవుళ్ల‌ను పూజించే ప‌ద్ధ‌తుల్లో అనేక విధానాలున్నాయి. పూవుల‌ను వాడ‌డం, అగ‌రుబ‌త్తీలు వెలిగించ‌డం, ధూపం, దీపం.. ఇలా అనేక మంది త‌మ అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి దేవుళ్లను పూజిస్తారు. అయితే ఎవ‌రు దేవున్ని పూజించినా దీపారాధ‌న చేయ‌కుండా పూజ‌నైతే ముగించ‌రు. ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబ‌ట్టి. దీపంతో దేవున్ని ఆరాధిస్తే శాంతి క‌లుగుతుంది. శుభం చేకూరుతుంది. అందుకే చాలా మంది దీపారాధ‌న విష‌యంలో శ్ర‌ద్ధ‌ను క‌నబ‌రుస్తారు కూడా.

అయితే సాధార‌ణంగా ఎవరు దీపారాధ‌న చేసినా దీపంలో వ‌త్తుల‌ను ఒక సంఖ్య ప్ర‌కారం పెట్టి ఆరాధిస్తారు. కానీ అలా కాకుండా భ‌క్తులు తాము పుట్టిన తేదీల‌కు అనుగుణంగా నిర్దిష్ట సంఖ్య‌లో వ‌త్తుల‌తో దీపారాధ‌న చేస్తే ఇంకా ఎక్కువ ఫ‌లితం క‌లుగుతుంద‌ట‌. అన్నీ శుభాలే చేకూరుతాయ‌ట‌. ఈ క్రమంలో జ‌న్మ‌తేదీల‌కు అనుగుణంగా ఏయే తేదీల్లో పుట్టిన వారు ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

deeparadhana according to birth date

మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 తేదీల మధ్య జ‌న్మించిన వారు 5 వ‌త్తుల‌తో దీపారాధాన చేయాలి. ఏప్రిల్ 21 నుంచి మే 20 మ‌ధ్య పుట్టిన వారు 7 వ‌త్తుల‌తో దీపం వెలిగించాలి. మే 21 నుంచి జూన్ 20 మ‌ధ్య పుట్టిన వారు 6 వ‌త్తుల‌తో దీపం వెలిగిస్తే మంచిది. జూన్ 21 నుంచి జూలై 20 మ‌ధ్య జ‌న్మించిన వారు 5 వ‌త్తుల‌తో దీపం వెలిగించాలి. జూలై 21 నుంచి ఆగ‌స్టు 20 మ‌ధ్య పుట్టిన వారు 3 వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలి. ఆగ‌స్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మ‌ధ్య పుట్టిన వారు 6 వ‌త్తుల‌తో దీపం వెలిగించాలి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబ‌ర్ 20 మ‌ధ్య పుట్టిన వారు 7 వ‌త్తుల‌తో దీపారాధాన చేయాలి.

అక్టోబ‌ర్ 21 నుంచి న‌వంబ‌ర్ 20 మ‌ధ్య జ‌న్మించిన వారు 2 వ‌త్తుల‌తో దీపం వెలిగించాలి. న‌వంబ‌ర్ 21 నుంచి డిసెంబ‌ర్ 20 మ‌ధ్య పుట్టిన వారైతే 5 వ‌త్తుల‌తో దీపారాధన చేయాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 21 నుంచి జ‌న‌వ‌రి 20 మ‌ధ్య వారైతే 6 వ‌త్తుల‌తో దీపం వెలిగించాలి. జ‌న‌వ‌రి 21 నుంచి ఫిబ్ర‌వరి 20 మ‌ధ్య పుట్టిన వారు 6 వ‌త్తుల‌తో దీపం వెలిగించాలి. ఫిబ్ర‌వ‌రి 21 నుంచి మార్చి 20 మ‌ధ్య జ‌న్మించిన వారు 2 వ‌త్తుల‌తో దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దేవుళ్ల‌కు దీపారాధ‌న చేస్తే దాంతో ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దీని వ‌ల్ల భ‌క్తుల‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు.

Share
Admin

Recent Posts