Deeparadhana : ప్రతి రోజు పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని.. అనుకున్న పనులు జరుగుతాయని.. భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయమేంటంటే పూజ చేయడానికి దీపారాధనకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇష్టానుసారంగా చేస్తే ఫలితం ఉండదు. దీపారాధన చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి. వాటి ప్రకారం చేస్తే ఫలితం వస్తుంది లేకపోతే ఫలితం శూన్యం. దీపారాధన నియమాలు తెలుసుకుందాం. ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది. అందులో సందేహమే లేదు. దీపారాధన చేసేటప్పుడు వత్తి వేసి తర్వాత నూనె పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు.
కానీ అది సరైన పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత వత్తులు వేయాలి. దీపారాధన చేసేటప్పుడు వెండి లేదంటే ఇత్తడి కుందులని ఉపయోగించవచ్చు. మట్టి కుందులను కూడా వాడొచ్చు. దీపారాధన చేసేటప్పుడు అంతకు ముందు ఉపయోగించిన కుందులని మళ్లీ కడక్కుండా వాడకూడదు. వాటిని మళ్ళీ శుభ్రం చేసుకుని ఆ తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి. దీపారాధన చేయడానికి సమయం కూడా ఉంటుంది. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య దీపారాధన చేస్తే ఎంతో మంచిది. అలాగే సూర్యాస్తమయం తర్వాత దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని స్మరిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
తూర్పుముఖంగా దీపారాధన చేస్తే గ్రహ దోషాలు కష్టాలు పోతాయి. ఆనందంగా జీవించొచ్చు. రుణ బాధలు, శని గ్రహ దోషాలు పోవాలంటే పడమర వైపు దీపాన్ని వెలిగించండి. సిరిసంపదలు కలగాలన్నా విద్య, వివాహంలో రాణించాలన్నా ఉత్తర దిశలో దీపాన్ని వెలిగించండి. దక్షిణ వైపు మాత్రం దీపాన్ని వెలిగించకూడదు. కష్టాలు, బాధలు కలుగుతాయి. దీపారాధన చేసేటప్పుడు తామర కాడతో చేసిన వత్తులని ఉపయోగిస్తే పూర్వజన్మ పాపాలు కూడా పోయి సంతోషంగా జీవించొచ్చు.
ఈతి బాధలు పోవాలంటే జిల్లేడు కాయ నుండి వచ్చిన దూదితో దీపం వెలిగించండి. వైవాహిక జీవితంలో బాధలు, ఇబ్బందులు ఉండకూడదు అంటే ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయండి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించడం మంచిది కాదు. అగ్గిపుల్లతో కర్పూరం వెలిగించి ఆ తర్వాత మీరు దీపాన్ని వెలిగించవచ్చు. దీపారాధన చేసేటప్పుడు విప్పనూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనె, నెయ్యి ఉపయోగించవచ్చు. అలాగే దీపాన్ని నేరుగా కింద పెట్టరాదు. తమలపాకులపై పెట్టాలి.