Pithru Dosham : ఎలా అయితే మన తండ్రి, మన తాత చేసిన పుణ్యాన్ని మనం అనుభవిస్తామో.. అలానే వాళ్ళు చేసిన పాపాలను కూడా మనమే అనుభవించాలి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిని అనుభవించే అర్హత ఎలా ఉంటుందో, వాళ్ళ పాప పుణ్యాలని కూడా మనమే అనుభవించాలి. పూర్వికులు పాపాలు చేస్తే, ఆ పాపాలు మనకి అంటుకుంటాయి. అదే పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు తెలిసి కానీ తెలియక నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఎందుకు కర్మలని అనుభవిస్తున్నాను అని.. దానికి కారణం పితృ దోషమే.
పితృ దోషం ఉన్నవాళ్లు ఈ జన్మలో ఎటువంటి పాపకర్మలని చేయకపోయినా, సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, దాని వెనుక కారణం పితృ దోషం. వారి పాపాలని కూడా మనమే పంచుకోవాలి. పితృ దోషం వలన దుష్పరిణామాలు చూద్దాం. చిన్నవాళ్లు అకాల మరణం పొందడం, అప్పుల పాలైపోవడం, శరీరంలో ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం వంటివి. ఇలాంటివి పితృ దోషం వలన కలుగుతాయి. అపనిందల పాలవడం, ప్రమాదాలకు గురవడం, మన కళ్ళముందే చిన్న పిల్లలు వ్యసనాలకి బానిసలు అవ్వడం వంటివి పితృ దోషం వలన కలుగుతాయి.
ఈ పాపాల నుండి గట్టెక్కాలంటే శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలి. కాశీలో లేదంటే పాపనాశి (అలంపురం జోగులాంబ, గద్వాల జిల్లా) లో మీరు పరిష్కారాన్ని పొందొచ్చు. ఈ శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలంటే పాలు అన్నంతో చేసిన పాయసం, అన్నము ముద్దపప్పు నెయ్యి, వడ నైవేద్యంగా పెట్టాలి. ఏదైతే నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని ఇంటిపేరు గల వంశస్థులు మాత్రమే తీసుకోవాలి. ఇతరులకి పెట్టకూడదు.
స్వయంగా ఈ వంటలు వండుకుని తీసుకువెళ్లి నైవేద్యం పెట్టాలి. అలా చేయలేకపోయిన వాళ్ళు పూజారి చేత చేయించొచ్చు. అలంపురం వెళ్లి తెల్లవారుజామున తుంగభద్రా నదిలో స్నానం చేసి, అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకున్నాక శ్మశాన నారాయణుడి దగ్గరకి వెళ్ళాలి. పని పూర్తయ్యాక వేరే చోటికి వెళ్లకుండా, ఇంటికి వెళ్లిపోవాలి. ఇలా చేస్తే పితృ దోషం పోతుంది.