ఎవరైనా సరే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావొద్దని, ధనం అధికంగా సంపాదించాలని.. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటుంటారు. అందుకోసమే కష్టపడుతుంటారు కూడా. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంక లేనిదేముంది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు.. మనం అనుకున్నవి జరగవు. సమస్యలు వస్తూనే ఉంటాయి. అన్ని రకాల సమస్యలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనల్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తాయి. అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా ఆమెకు ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే.. అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనవృద్ధి జరుగుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవి ముందు ఒక పాత్రలో నీటిని పోసి అందులో పచ్చ కర్పూరం, పసుపు వేసి ఉంచాలి. ఆ నీటిని ప్రతి రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అన్ని ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి. అప్పుల నుంచి బయట పడతారు. రుణ విముక్తులు అవుతారు. అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీంతో అన్ని సమస్యల నుంచి విముక్తులు అవుతారు. ఇక దీంతోపాటు పచ్చ కర్పూరాన్ని వస్త్రంలో మూటలా కట్టి దాన్ని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ ఉండాలి. ఇలా రోజూ చేయాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇక పచ్చ కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం, పూజ గదిలో ఉంచి పూజలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్నవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ క్రమంలో ధనం వృద్ధి చెందుతుంది. కోటీశ్వరులు అవుతారు. అలాగే చిన్న పచ్చ కర్పూరం ముక్కను ఒక పేపర్‌లో మడత పెట్టి పర్సులో ఉంచాలి. దీంతో ఆదాయం పెరుగుతుంది. అప్పుల నుంచి బయట పడతారు. ఇలా లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైన పచ్చ కర్పూరంతో పరిహారాలు చేస్తే.. ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయట పడతారు. అంతా మంచే జరుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.