లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఆశిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే.. ఆ ఇంట్లో లేమి అన్న కొరత ఉండదు. సుఖసంతోషాలతో ఉండగలరు. అయితే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది చాలా రకాలు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం అయితే ఇల్లంతా కళగా అలంకరిస్తారు. అయితే లక్ష్మీ దేవి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా ? సాధారణంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి గడపకు పసుపు రాసి.. పూలతో అలంకరిస్తారు. అలాగే.. ఇంట్లో దేవుడి గదిలో పూలు, పండ్లతో చక్కగా పూజలు నిర్వహిస్తారు. మంత్రాలు, శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు, కొంతమంది శుక్రవారం డబ్బులు ఇతరులకు ఇవ్వరు. అలాగే.. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి.. చాలామంది చాలా రకాల నియమాలు పాటిస్తుంటారు.
కానీ.. లక్ష్మీ దేవి ఎక్కడ ఉంటుంది ? ఎలాంటి ప్రాంతంలో ఉండదు అనే విషయాన్ని మహావిష్ణువు ఎలా వివరించాడో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుని పాలకులపై కోపం ప్రదర్శించే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. శంఖం శబ్ధం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీ నివాసం ఉండదట. ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించని చోట కూడా ఆ లక్ష్మీదేవి ఉండదని మహా విష్ణువు వివరించారు. అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని వివరించారు.
ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట. అంటే.. ఇంట్లో పూజలు, పునస్కారాలు లేకుండా, ఎప్పుడు లేమి అనే బాధపడే వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. ఇంటికి దీపం ఇల్లాలు అయిన ఆమె ఎప్పుడూ కంటతడి పెడుతూ ఉంటే.. అక్కడ లక్ష్మీదేవి ఉండదని విష్ణుమూర్తి వివరించాడు. చెట్లను నరికేవాళ్ల ఇంట్లో కూడా లక్ష్మి కటాక్షం లోపిస్తుందట. సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాళ్ల ఇంట్లో, తడి పాదాలతో నిద్రపోయేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదట. తులసీ దేవిని పూజించే ఇంట్లో, శంఖ ధ్వని ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విష్ణుమూర్తి సెలవిచ్చారట.