Lord Shani : ప్రతి ఒక్కరు కూడా, అనుకున్నవి పూర్తి అవ్వాలని అనుకుంటారు. అనుకున్న దానిని చేరుకోవాలని, విజయం అందుకోవాలని చూస్తూ ఉంటారు. గ్రహల్లో అత్యంత కీలకమైనది శని గ్రహం. శని గ్రహ ప్రభావం అందరి మీద ఉంటుంది. జాతకంలో శని అనుకూలంగా ఉంటే, మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. శనదేవుడు మనం చేసిన కర్మ ఆధారంగా, అనుకూల, ప్రతికూల ప్రభావాలను ఇస్తారు. మంచి పనులు చేస్తే శని దేవుడు సంతోషపడతాడు. చెడు కర్మలు చేసినట్లయితే, శని దేవుడు బాధపడతాడు.
కొన్ని రాశుల వాళ్ళు అంటే శని దేవుడికి చాలా ఇష్టం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంటున్నారు. అందుకనే, ఆ రాశుల వాళ్ళకి శని ప్రభావం తక్కువ ఉంటుందట. శని దేవుడు కనుక ఇష్టపడినట్లైతే, ధనవంతులని చేసేస్తాడు. శని దేవుడు కనుక అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు అంటే, జీవితం తలకిందులు అయిపోతుంది. కుంభరాశి అంటే, శనిదేవుడికి ఎంతో ఇష్టం. ఈ రాశి వాళ్లపై శని ప్రభావం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
విజయాన్ని అందుకోవడానికి శని దేవుడు కుంభ రాశి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. శని దేవుడికి మకర రాశి అంటే కూడా ఇష్టం. శని గ్రహానికి ఇష్టమైన రాశి చక్రాల్లో మకరం కూడా ఉంది. ఈ రాశి వాళ్ళకి శని గ్రహమే అధిపతి. కనుక మకర రాశి వారిపై, శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. విజయాన్ని అందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఇస్తాడు.
అలానే, తులా రాశి వాళ్ళకి కూడా శని మంచి చేస్తాడు. తుల రాశి వారిపై శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అనుకూలతని సృష్టిస్తుంది. తులా రాశి వారిని శని దేవుడు అనుగ్రహిస్తాడనే దాని గురించి జ్యోతిష్య శాస్త్రం లో చెప్పడం జరిగింది. తులా రాశి వారికి కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ అవేమి ఎక్కువ కాలం ఉండవుట.