Hair Tips : ఆడవారు అందానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. అందంగా కనిపించడానికి జుట్టుది కీలక పాత్ర. అందుకే స్త్రీలు జుట్టు పొడవుగా ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ పోషకాహారం లోపం, పొల్యూషన్ వలన జుట్టు రాలే సమస్య ఇటీవల ఎక్కువైపోయింది. దీంతో చింతిస్తూ మానసికంగా కూడా కృంగిపోతారు. అంతేకాకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ప్రతిఫలం లేదు అనుకునేవారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. దీనిలో ఉపయోగించే 5 పదార్థాలు సైంటిఫిక్ గా హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడతాయని నిరూపించారు. అవేంటంటే.. 1. మెంతులు.. ఇవి జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా పెంచుతాయి.
అంతేకాకుండా మంచి హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తాయి. 2. పెరుగు.. దీనిని ఉపయోగించడం ద్వారా జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. 3. ఉసిరి పొడి.. ఇది జుట్టులో వాపులు రాకుండా రక్షించడానికి, జుట్టును నల్లగా చేయడంలో ఉపయోగపడుతుంది. 4. అలోవెరా.. ఇది కూడా జుట్టు ఒత్తుగా ఎదగడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును స్మూత్ గా ఉంచుతుంది. 5. బీట్‌రూట్ జ్యూస్.. జుట్టును ఒత్తుగా చేస్తుంది. ఇందులో మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి వాడుకోవచ్చు. లేదా మెంతులను పొడి చేసుకుని పెరుగులో కలుపుకొని వాడుకోవచ్చు.
ఇప్పుడు ఈ ఐదింటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని తలకు కుదుళ్ల నుంచి చిగుళ్ల వరకు అప్లై చేయాలి. ఒక గంట సేపు ఉంచి తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు పట్టించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో వేసిన అన్నింటిలోనూ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ జుట్టుకు రక్తప్రసరణ బాగా జరగడానికి సహాయపడతాయి. జుట్టు గ్రోత్ కు కావాల్సినవన్నీ రక్త సరఫరా ద్వారా చక్కగా అందుతాయి. ఆశించిన విధంగా మీ జుట్టు ఒత్తుగా ఉండడానికి ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.