బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారికి చిన్న వయసులోనే విశేషజ్ఞానం లభించింది. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలతో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం, వినడం మనకు పరిపాటే. ఆయన చెప్పిన ఎన్నో విషయాలలో ఎన్నో జరిగాయి కూడా. ఇంకా ఆయన చెప్పిన విషయాల్లో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే భయం కలుగక మానదు. అలా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో జరగబోయే రోజుల్లో జరిగే విషయాలు తెలుసుకుందాం.
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కోరంకియగు ఒక జబ్బు వచ్చేనయా, కోట్లమందికి తగిలి కోడిలాగే తూగి సచ్చేరయ అంటూ పేర్కొన్నారు. ఆయన చెప్పిన విధంగానే 2020లో కరోనా బారిన పడి ఎంతో మంది మరణించారు. అయితే ఈ మహమ్మారి అంత సులువుగా వదిలిపెట్టదని అది మళ్ళీ వచ్చి ఎంతో మంది ప్రాణాలను తీసుకుంటుందని చెప్పారు. దుర్మార్గులు రాజులవుతారు, మంచి ప్రవర్తన గలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారని చెప్పారు. అలాగే మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని కాలజ్ఞానంలో చెప్పారు.
బ్రహ్మంగారు అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయని చెప్పారు. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. ఇక 2032 నాటికి ప్రపంచంలో ప్రకృతి వినాశనాలు, యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని కాలజ్ఞానంలో తెలిపారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువు అవుతాయన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడతాడని, దొంగ స్వాములు పుట్టుకొస్తారంటూ చెప్పారు. ఇక కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను తెలిపారు బ్రహ్మంగారు.