ఆధ్యాత్మికం

తిరుమ‌ల 7 కొండ‌ల వెనుక ఉన్న క‌థ‌లు ఇవే.. అవి ఎలా ఏర్ప‌డ్డాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏడు కొండలు&&num;8230&semi;ఈ పేరు వింటేనే భక్తజనుల వళ్లు పులకరిస్తుంది&period; భక్తి ఆవహిస్తుంది&period; శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే ఏడుకొండలు&period; కలియుగంలో స్వామివారికి ఎంతవిశిష్టత ఉందో ఆయన నివశించే ఈ సప్తగిరులకూ అంతే ప్రాముఖ్యత ఉంది&period; పచ్చని లోయలు&comma; జలపాతాలు&comma; అపార ఔషదాలు&comma; కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు&period; తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం&period; ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది&period;&period; వైకుంఠంలో అలిగివచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడుకొండలపై కొలువైనాడని స్థలపురాణం చెబుతుంది&period; వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే&&num;8230&semi; భూలోకంలోకి వచ్చి ఏడుకొండలుగా మారారని పురాణాలు చెబతున్నాయి&period; అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు&period; నంది వృషబాధ్రి అయ్యాడు&comma; హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీల&&num;8230&semi; నీలాద్రి కొండగా మారింది&period; శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు&period; పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవచేస్తున్నాడు&period; ఇక నారాయణాద్రి&comma; వెంకటాద్రిలు శ్రీవారి రూపాలే&period; ఈ రెండు కొండలు జయ&comma; విజయులకు ప్రతిరూపాలు&period; తిరుమల తిరుపతి లోగల ఏడు కొండలపై కొలువై వున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు &period; భక్తుల కోరికలను తీర్చే అభయ హస్తుడు శ్రీనివాసుడు &period; వెంకన్న కొలువై వున్న‌ ఏడూ కొండలు కేవలం అద్రులు &lpar;కొండలు&rpar; మాత్రమే కాదు వాటి వెనుక కొన్ని గాధలు వున్నాయి &period; పూర్వం వృషభాసురుడు అనే à°¶à°¿à°µ భక్తుడు à°­à°² గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దానికి తలపడ్డాడు &period; యుద్ధం లో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది అని శ్రీహరిని వేడుకున్నాడు &period; స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వ్రుశాభాసురుడిని సంహరించాడు &period; ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చినది &period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91731 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tirumala-hills-&period;jpg" alt&equals;"this is how tirumala 7 hills were formed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామి వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబ‌à°°à°¿&period; ఆమె భక్తి కి మెచ్చిన వెంకటేశ్వరుడు ఏడు కొండలలో ఒక కొండ కి ఆమె పేరుగా పేరుని పెట్టారు&period; తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే&period;&period; శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు &period; ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినందు వల్ల అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది&period; మరో విధంగా కూడా చెబుతారు&period; దాయాదులైన కద్రువ పుత్రుల &lpar;నాగులు&rpar; ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు&period; స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు&period; దానికి స్వామి&&num;8230&semi; తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట&period; అదే గరుడాచలం&period; వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట&period; సంతానం కోసం అంజనా దేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది &period; దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంతరం బలశాలి&comma; చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది &period; అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది &period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణుదర్శనం కోసం నారాయణుడు అనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదుగా ఈ పర్వతం నారాయణాద్రి గా ఖ్యాతి పొందింది &period; నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు&period; అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట&period; అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట&period; ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు&period; కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి&period;&period;వేం అనగా సమస్త పాపాలను కటః అనగా దహించునది అంటే స్వామి వారి సమక్షంలో పాప రాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది &period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-91732" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tirumala-hills-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏడుకొండలలో ప్రధానమైనది శేషాద్రి&period; ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది &period; నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వెంకటాచాలాన్ని చుట్టుకున్నాడు &period; వాయు దేవుడు అతడిని వేసిరి వేయగా పర్వతం తో పాటు అక్కడ వచ్చి పడతాడు &period; ఓడిపోయిన‌ భాదతో వున్న‌ ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ &comma;నిన్ను ఆభరణం గా ధరిస్తాను &period; నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుంది అని వరం ఇచ్చాడు &period; దానితో ఈ కొండ శేషాద్రి గా ప్రసిద్ది పొందింది &period; ఈ విధం గా ఏడూ కొండలు ఏర్పడి స్వామి వారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవం గా ప్రసిద్ది పొందాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts