ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి కోరిక‌లు ఉన్నా నెర‌వేరుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దత్తాత్రేయుడు నిరాకారుడు&period; దిక్కులనే అంబరములుగా చేసుకున్నవాడు&period; కేవలం భక్తునుద్ధరించేందుకే రూపాలను ధరించేవాడు&period; బాలకుడిగా వచ్చినా&comma; ఉన్మత్తుడిగా ఉన్నా&comma; కల్లుగీసే గౌడకులస్తుడిగా కనిపించినా&comma; పిశాచరూపంలో ఉన్నా అవన్నీ భక్తులను ఉద్దరించడానికే&excl; అటువంటి దత్తాత్రేయుల వారు పడుకున్న పాములాగ’శయన రూపంలో ఉన్న అత్యంత అరుదైన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది&period; ఈ దేవాలయం దర్శిస్తే కలిగే లాభాలు&comma; రూప విశిష్టత సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం&period;&period; వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహంలో దాగున్న పెనవేసుకున్న జంట సర్పములతో ఉంటుంది&period; అభివృద్దికి ఆమడదూరంలో ఉన్న ఒక కుగ్రామంలో&comma; ప్రపంచంలోని ఏకైక రాహురూప &lpar;సర్పరూప&rpar; శయన దత్తాత్రేయుడు నిఘూఢంగా ఉండటం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరదవెల్లి గ్రామం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలోగల బోయినపల్లి మండలంలో కరీంనగర్‌ వేములవాడ రోడ్‌లో కొదురుపాక స్టేజి వద్దగలదు&period; వరదవెల్లి గ్రామం మిడ్‌ మానేరు జలాశయం కింద రావడం వల్ల వరదవెల్లి గ్రామం మొత్తం దాదాపుగా నిర్వాసిత గ్రామమే&period; మిడ్‌ మానేరు జలాశయం పూర్తయితే ఈ అరుదైన దత్తక్షేత్రంతో పాటు ఊరు కుడా ఉండకపోవచ్చు&period; పూర్వం నుండి తరచుగా ఈ గ్రామం ముంపుకు&comma; వరదలకు గురౌతుండం వల్ల వరదవెల్లి అని పేరు వచ్చిందని కొంత మంది గ్రామస్తుల అభిప్రాయం&period; అయితే గురు దత్తాత్రేయుల వారు వరద హస్తములతో ఇక్కడ వెలియడం వల్ల వరదవెల్లి’అనే పేరొచ్చిందన్నది చారిత్రాత్మక కథనం&period; అత్యంత అరుదైన రాహురూప &lpar;సర్పరూప&rpar; శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత&period; ఇటు వంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడాలేదు&period; ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే దత్తాత్రేయుడు వేంకటేశ్వర స్వామి రూపంలో దత్త వేంకటేశ్వర స్వామి గా కుడా వెలిశారు&period; దత్త వేంకటేశ్వర స్వామి గుడి కుడా ప్రపంచంలో ఇదొక్కటే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79988 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;varadavelli-temple&period;jpg" alt&equals;"visit this varadavelli temple to fulfill your wishes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరదవెల్లి గ్రామం చారిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన గ్రామం&period; నీటి నిల్వలు అధికంగా ఉండి బాగా పంటలు పండే ప్రదేశం&period; అప్పట్లో గుట్ట మీదగల శయన దత్తాత్రేయుడు&comma; దత్త వేంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించేవారట&period; కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది&period; దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీవేంకటాచార్యులు అనే ఒక కుర్ర వైష్ణవ అవధూత &lpar;ఈయననే వెంకావధూత అనేవారు&rpar; వేములవాడకు వచ్చి అక్కడ నుండి వరదవెల్లికి వచ్చి అక్కడ గల గుట్ట మీద శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసారు&period; వెంకావధూత వేంకటేశ్వర స్వామి వారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కుడా&period; వారి తపస్సుకు మెచ్చిన వేంకటేశ్వర స్వామి వెంకావధూత కోరిక మేరకు దత్తవెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దత్తవెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించిపోయిన వెంకావధూత తదుపరి కుడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయుల వారి కోసం ఘోర తపస్సు చేసారు&period; ఆవిధంగా 28 సంవత్సరాలు దత్త దర్శనం కోసం నిరంతరం తపించారు&period; ఆఖరికి ఒకానొక గురువారం ఉదయం సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏఖముఖుడిగా ప్రత్యక్షమై వెంకావధూత భక్తి శ్రద్ధలకు మెచ్చి ఇలా ఆనతిచ్చారని ఇక్కడి పండితులు పేర్కొంటున్నారు&period; వారి ప్రకారం దత్తాత్రేయ స్వామి వెంకావధూతతో నీకు రాహు మహర్దశ జరుగుతుంది&period; ఆ కర్మను నువ్వు ఇంకా అనుభవించాలి కాబట్టి నేనే రాహురూపం లోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తాను&period; నా త్రిముర్త్యాత్మకతకు చిహ్నంగా ఈ క్షేత్రం లో మూడు నింబవృక్షాలు కుడా ఆవిర్భవించి&comma; అరుదైన దత్తక్షేత్రంగా కీర్తికెక్కుతుంది&period; ఇక్కడకి దర్శనానికి వచ్చే భక్తులను రాహువు రూపంలో ఉన్న నేను త్వరగా ఉద్ధరిస్తాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-79987" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;varadavelli-temple-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్షేత్రం లో గల నా రాహురూప &lpar;సర్పరూప&rpar; శయన దత్తాత్రేయ విగ్రహానికున్న వరద హస్తాలు భక్తులనెల్లవేళలా కాపాడతాయి&period;&period; అంటాడు&period; అంతట శ్రీ దత్తాత్రేయుల వారు రాహురూప &lpar;సర్పరూప&rpar; శయన దత్తాత్రేయుడుగా మారి వెంకావధూత క‌ర్మలను త్వరగా అనుభవించేట్టుగా చేసి వెంకావధూతను వారిలోకి ఐక్యం చేసుకుంటారు&period; ఆ విధంగా కేవలం భక్తులను ఉద్ధరించడానికి మరో రూపం లోకి మారి అత్యంత అరుదైన రాహురూప &lpar;సర్పరూప&rpar; శయన దత్తాత్రేయుడు వరదవెల్లి దత్తాత్రేయుడుగా యేర్పడ్డాడు&period; ముందు చెప్పుకున్నట్లుగా రూపమే లేని గురు దత్తాత్రేయుడు ఇక్కడ చిత్రంగా ఉండి పూజలందుకుంటున్నారు&period; దత్తాత్రేయుడు పడుకుని రాహు రూపంలో ఉండడం&comma; దత్తత్రేయునికి ప్రతీకగా నేటికి ఉన్న వందల ఏళ్ళనాటి నింబవృక్షాలు&comma; వరదవెల్లి రాహురూప &lpar;సర్పరూప&rpar; శయన దత్తాత్రేయుడిని ఫోటో తీసినప్పుడు విగ్రహం లో దాగిఉన్న జంట సర్పాల ఆనవాళ్ళు కనిపించడం&comma; దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వరస్వామిగా పిలవబడడం&comma; ఇటువంటి అతి అరుదైన క్షేత్రం త్వరలో నదీగర్భంలో కలియనుండడం&comma; క్షేత్రానికి 3 వైపులా నీళ్లు ఉండటం ఈ క్షేత్రం ప్ర‌త్యేక‌à°¤‌లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే&period;&period; తొందరగా తెమలని కోర్ట్‌ కేసులు ఉన్నవారు&comma; వయస్సు పెరిగినా ఉద్యోగంలో సెటిల్‌ అవ్వనివారు&comma; రాహు మహర్దశలో ఉన్నవారు&comma; భర్త ఒక చోట ఉద్యోగంలో భార్య&comma;పిల్లలు మరొక చోట ఉన్నవారు లేదా భార్య ఒక చోట ఉద్యోగంలో భర్త&comma; పిల్లలు మరొక చోట ఉన్నవారు&comma; ఉద్యోగ బదిలీలు కావాలనుకునేవారు&comma; ఆఫీస్‌ పాలిటిక్స్‌లో పైచేయి&sol;విజయం సాధించాలనుకునే వారు&comma; దొంగతనం మొదలైన అభాండాలు మీదపడ్డవారు&comma; తరచుగా అబార్షన్లు&sol;సంతన నష్టం కలిగినవారు à°¦‌ర్శిస్తే అనుకున్న‌వి నెర‌వేరుతాయి&period; వరదవెల్లి రాహురూప &lpar;సర్పరూప&rpar; శయన దత్తాత్రేయుడిని దర్శించుకునే వారు అభిషేక సామగ్రిని&comma; నల్ల వస్ర్తాన్నితీసుకెళ్ళాలి&period; అలాగే అక్కడ గల దత్త వెంకటేశ్వర స్వామి వారికి పూజా సామాగ్రి మీ శక్తి కొద్ది పట్టు వస్ర్తాన్ని తీసుకెళ్ళాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts