Food To Gomatha : హిందువులు ఆవును గోమాతగా భావించి పూజలు చేస్తుంటారు. ఎందుకంటే ఆవు శరీర భాగాలన్నింటిలోనూ సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. అందుకనే ఆవును గోమాతగా పూజిస్తారు. ఆయుర్వేదంలోనూ ఆవుకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఆవు పేడ, మూత్రం లాంటివన్నీ ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను అందిస్తాయి. వాటితో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇలా ఆవు వల్ల మనకు అన్ని విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే గోమాతకు పలు రకాల ఆహారాలను తినిపించడం వల్ల మనం పలు ఫలితాలను పొందవచ్చు. వాటికి తినిపించే ఆహారాన్ని బట్టి మనకు ఫలితాలు కలుగుతాయి. గోమాతకు ఏయే ఆహారాలను తినిపిస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గోమాతకు నానబెట్టిన ఉలవలను పెట్టడం వల్ల వృత్తిలో నిలకడ ఉంటుంది. స్థాన చలనం, ఒత్తిడి, ఆందోళన వంటివి లేకుండా సాఫీగా పనిచేస్తారు. వ్యాపారులు అయితే స్థిరంగా లాభాలు వస్తాయి. నష్టాలు రాకుండా ఉంటాయి. అలాగే గోమాతకు నానబెట్టిన బొబ్బర్లను పెట్టడం వల్ల ధనం అభివృద్ధి చెందుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. డబ్బుకు లోటు రాదు. నానబెట్టిన గోధుమలను పెడితే కీర్తి, పట్టుదల పెరుగుతాయి. తోటకూర, బెల్లం కలిపి పెడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. నానబెట్టిన కందులను పెడితే కోపం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారు. నానబెట్టిన మినుములను గోమాతకు పెడితే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అనేక పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
గోమాతకు నానబెట్టిన శనగలను పెట్టడం వల్ల ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. నానబెట్టిన పెసలను పెడితే విద్యలో అభివృద్ధి చెందుతారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. బంగాళా దుంపలను గోమాతకు పెట్టడం వల్ల నరఘోష నివారణ, నర దిష్టి పోతాయి. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. బీట్‌రూట్ లేదా పాలకూర పెడితే ఐశ్వర్యాలు కలుగుతాయి. దోసకాయలను తినిపిస్తే శత్రువులు నివారించబడతారు. టమాటాలను పెడితే వివాహం త్వరగా జరుగుతుంది. వంకాయలను పెడితే సంతాన ప్రాప్తి జరుగుతుంది.
గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవులను చేపడుతారు. బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం కలుగుతుంది. దొండకాయలను తినిపిస్తే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మినపపిండి బెల్లం పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెడితే ఉద్యోగం వస్తుంది. నానబెట్టిన చాయ పెసర పప్పును పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నానబెట్టిన కందిపప్పును తినిపిస్తే రుణ విముక్తులు అవుతారు. నానబెట్టిన మినప పప్పును తినిపిస్తే ఆరోగ్యం కలుగుతుంది. వ్యాధుల నుంచి బయట పడతారు. నానబెట్టిన పచ్చి శనగ పప్పును గోమాతకు తినిపిస్తే కుటుంబంలో ఉండే కలహాలు తొలగిపోతాయి. పొట్ట పెసర పప్పును నానబెట్టి గోమాతకు తినిపిస్తే బుద్ధి కుశలత వస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. తెలివి తేటలు వస్తాయి. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రాణిస్తారు. ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు పెట్టడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు.