Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లు తుల‌సిని ఎందుకు ఉప‌యోగించ‌రు..? అస‌లు కార‌ణం ఇదే..!

Admin by Admin
May 23, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తులసి ఆకులు చాలా పవిత్రమైనవి అందుకే ప్రతి దేవుడి గుడిలో తులసి మాలలతో అలంకరణ చేస్తారు..అయితే వినాయకుడికి మాత్రం తులసిని వాడరు ఎందుకో తెలుసా.. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది.. అస్సలు ఎందుకు వాడ‌రో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మనం ఎటువంటి పూజలను తలపెట్టిన కూడా ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాము.. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలుగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. ఆయన్ని స్మరించనిదే ఏ పని తలపెట్టరు..బుధవారం రోజున వినాయక పూజ చేస్తే మంచి ఫలితాల లభిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. కార్యభంగం, జాప్యం లేకుండా ఉంటుందని నమ్మకం, ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది. వినాయక పూజలో రకరకాల మోదకాలు సమర్పిస్తారు. అంతే కాదు వీటితోపాటు కుంకుమ, అక్షతలు, దర్భలు, పువ్వలు, సుగంధ ద్రవ్యాలు, సింధూరం వంటివన్నీ గణేష పూజలో వాడుతారు. కానీ తులసిని మాత్రం గణేష పూజకు ఉపయోగించరు..ఎందుకంటే..

why tulsi leaves are not used in lord ganesha puja

తులసీ దేవి అతడి అందమైన రూపానికి ఆకర్శితురాలవుతుంది. గణేషుని వివాహమాడాలనే కోరిక మనసులో కలిగింది. ఆమె మనసులోని ఆ కోరిక వల్ల అతడికి తపోభంగం అయ్యింది. తులసి వల్ల తన తపోభంగం జరిగిందని తెలుసుకుని తులసికి తాను బ్రహ్మచారినని, ఆమె కోరికను తిరస్కరించాడు. ఆ తిరస్కారానికి ఆమెకు కోపం వచ్చింది. దీర్ఘకాలం పాటు బ్రహ్మచారిగా ఉండిపొమ్మని శపిస్తుంది. అకారణంగా శాపానికి లోనైన వినాయకుడికి కూడా కోపం వచ్చి తులసిని అసురుడిని భర్తగా పొందుతావని, అతడి చరలో ఉండిపోతావని శపిస్తాడు… ఇక తులసి క్షమించమని వేడుకుంటుంది. కానీ వినాయకుడు మాట వెనక్కి తీసుకోడు..

గణేష శాపం వల్ల తులసికి చంకచూడుడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది. అతడికి కృష్ణ కవచం ఉందనే గర్వంతో లోక కంటకుడిగా మారి అందరిని బాధిస్తుంటాడు. తులసి పాతివ్రత్య మహత్మ్యం వల్ల అతడిని సంహరించడం విష్ణుమూర్తికి దుర్లభం అవుతుంది. వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి.. మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్య భంగానికి వినాయకుడు కారణమని తెలుసుకుని శిరస్సులేకుండా జీవించమని తులసి శపిస్తుంది.. అందుకే వీరిద్దరి మధ్య వైరం ఉంటుంది అందుకే వినాయక చవితి మినహాయించి ఎప్పుడూ తులసి కనిపించదు.. అదన్నమాట అసలు మ్యాటర్..

Tags: Lord GaneshaTulsi Leaves
Previous Post

ఈ వ‌స్తువుల‌ను పొర‌పాటున కూడా కింద పెట్ట‌కూడ‌దు.. ఎందుకంటే..?

Next Post

మీ పిల్ల‌లు చెడు మార్గంలో వెళ్తుంటే.. ఇలా దారిలో పెట్టండి..

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!