సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత మన ఇంటిలో బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం చేస్తుంటాము. అయితే ఈ విధంగా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. బూడిద గుమ్మడికాయ నిజానికి ఎన్నో పోషకాలు కలిగినది మాత్రమే కాకుండా ఏడాది మొత్తం కుళ్ళిపోకుండా ఉండే ఒకే ఒక్క కూరగాయ అని చెప్పవచ్చు. అదేవిధంగా బూడిద గుమ్మడికాయను ఇంటిలో కట్టడం వల్ల మన ఇంటిపై పడిన చెడు ప్రభావం లేదా చెడు దోషాలను గ్రహించే శక్తి గుమ్మడికాయకి ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఇంటికి బూడిద గుమ్మడికాయను వేలాడదీస్తారు.
ఈ విధంగా మన ఇంటిపై ఏ విధమైన నరదృష్టి, చెడు ప్రభావం పడకుండా ఉండటం కోసమే గుమ్మడి కాయను వేలాడదీస్తారు. అయితే కొన్నిసార్లు గుమ్మడికాయ కుళ్ళి పోతూ ఉంటుంది. ఈ విధంగా గుమ్మడికాయ కుళ్ళి పోతే మన ఇంటిపై నరదృష్టి ప్రభావం, చెడు ప్రభావం అధికంగా ఉందని అర్థం. ఈ క్రమంలోనే ఈ విధంగా కుళ్ళిపోయిన గుమ్మడికాయను తీసి బయట పడేయాలి. దాని స్థానంలో మరొక గుమ్మడికాయను పురోహితుల చేత పూజ చేయించి కట్టాల్సి ఉంటుంది.
ఈ విధంగా ఇంట్లో గుమ్మడికాయను కట్టిన తర్వాత ప్రతిరోజూ అగరవత్తుల ధూపం వేసి అగరబత్తులు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాక్కొని ఇంట్లో అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. అయితే ఈ బూడిద గుమ్మడికాయ ఎల్లప్పుడూ కూడా మన ఇంటి ప్రధాన గుమ్మానికి బయట వైపు ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఎలాంటి చెడు ప్రభావాన్ని మన ఇంటి లోనికి ప్రవేశించకుండా చేస్తుంది. కేవలం బూడిదగుమ్మడికాయ మాత్రమే కాకుండా గోమాత సహిత నవ యంత్ర యుక్త ఐశ్వర్య కాళీ ఫోటోను ఇంటి గుమ్మంపై పెట్టడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.