టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. వెండితెర, బుల్లితెర ప్రేక్షకులను తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించి ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు ఎన్నో సక్సెస్ లను కమెడియన్ అలీ సొంతం చేసుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సీతాకోకచిలుక సినిమాతో బాల నటుడిగా కెరియర్ ని స్టార్ట్ చేసిన అలీ.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బర్మాను వదిలి రాజమండ్రిలో స్థిరపడింది అలీ కుటుంబం.
అలీ తండ్రి అబ్దుల్ సుభాన్ దర్జీ పని చేసేవాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. అలీకి చిన్నప్పటి నుండే చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఓసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ చిత్ర బృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీ ని చూసి దర్శకుడు విశ్వనాథ్ ఆ సినిమాలో బాల నటుడిగా అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అలీ భార్య జుబేద.. ఆయనకి ముగ్గురు సంతానం. అలీ తమ్ముడు ఖయ్యుం కూడా నటుడు అన్న విషయం తెలిసిందే. ఇక అలీ పలు టాక్ షోలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ టీవీ చానల్‌లో ఆలీతో సరదాగా అనే షో చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఓ ఎపిసోడ్‌లో ఆలీ తన జీవితంలో జరిగిన చాలా విషయాలను పంచుకున్నారు. తన లవ్ స్టోరీ ని కూడా ఈ సందర్భంగా రివిల్ చేశారు అలీ. మా ఇంటికి దగ్గరలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఒక రోజు వర్షంలో తడుచుకుంటూ వెళ్లడం చూసి నా గొడుగు ఇచ్చాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ వాళ్ళ అమ్మగారికి నేను నచ్చలేదు. దాంతో ఆ అమ్మాయితో విడిపోవాల్సి వచ్చింది అని తన లవ్ స్టోరీ ని చెప్పుకోచ్చారు అలీ.