కొన్ని రోజులుగా తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ కూడా చూసుకుంటున్నారు. నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. అలాంటి హీరోలు తెలుగులో ఎక్కువగానే ఉన్నారు. మహేష్ బాబు నుంచి విజయ్ దేవరకొండ వరకు చాలామంది హీరోలు బిజినెస్ చేస్తున్నారు. అయితే, టాలీవుడ్ లో ధనికమైన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగార్జున – నికర విలువ 3000 కోట్లు. అత్యంత ధనిక టాలీవుడ్ హీరోలలో ఫస్ట్ నాగార్జుననే. రూ. 3 వేల కోట్ల నికర విలువతో మొదటి స్థానంలో ఉన్నారు. సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోస్, టెలివెంచర్లు మరియు ఇతర వ్యాపారాలతో బాగా సంపాదిస్తున్నారు.
రామ్ చరణ్ – నికర విలువ 2800 కోట్లు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ, ట్రూజెట్, ఆలైట్ వ్యాపారం మరియు ఇతర వ్యాపార హోల్డింగ్ లతో, 2800 కోట్ల రూపాయల నికర విలువతో రెండో స్థానంలో ఉన్నాడు రామ్ చరణ్. చిరంజీవి – నికర విలువ 1500 కోట్లు. జూనియర్ ఎన్టీఆర్ – నికర ఆస్తుల విలువ 1000 కోట్లు. సినిమాల ద్వారానే సంపాదిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నికర విలువ – 800 కోట్లు. భారీ ఆస్తులు, ఆస్తులు విలువలు మరియు ఇతరులతో బాలయ్య నికర విలువ 800 కోట్లుగా ఉంది. అల్లు అర్జున్ నికర విలువ – 350 కోట్లు. తండ్రి అల్లు అరవింద్ ఆస్తులు మరియు సినిమాలతో బన్నీ నికర విలువ దాదాపు 350 కోట్లు. ప్రభాస్ నికర విలువ – 200 కోట్లు. బాహుబలి,సాహో సినిమాల ద్వారా ప్రభాస్ భారీగానే సంపాదించాడు. మహేష్ బాబు నికర విలువ – 150 కోట్లు. 30+అడ్వర్టైజింగ్ బ్రాండ్లు, ఏఎంబి సినిమాస్, మూవీస్ మరియు ప్రొడక్షన్ హౌస్ తో జిఎంబి పేరుతో మహేష్ బాబు బాగానే సంపాదిస్తున్నాడు.