Anasuya : వెండితెర రంగమ్మత్తగా పేరుగాంచిన అనసూయ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండే ఈమె తాను పెట్టే పోస్టుల కారణంగా వార్తల్లోకి ఎక్కుతుంటుంది. మొన్నీ మధ్యే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె చేసిన కామెంట్లు దుమారం రేపాయి. దీంతో తరువాత ఈమె వివరణ ఇచ్చుకుంది. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి కామెంట్లనే చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అనసూయ వివాదాస్పద కామెంట్లు చేసింది. ఆ దినోత్సవం వస్తేనే పురుషులకు మహిళలు గుర్తుకు వస్తారని.. కొందరు పురుషులకు ఆ దినోత్సవం కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుందని.. తరువాత యథావిధిగా వారు మహిళలను హింసిస్తూనే ఉంటారని.. అనసూయ కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజా ఈమె చేసిన ఓ రీల్స్ వీడియోలో.. పురుషులు అంత అవసరమా ? వారికి అంత ప్రాధాన్యతను కల్పించాలా ? అని వ్యాఖ్యలు చేసింది. చిత్రంలో ఆమె భర్త భరద్వాజ్ కూడా ఉన్నారు.
View this post on Instagram
అయితే అనసూయ పెట్టిన తాజా పోస్టు కూడా వివాదాస్పదం అవుతోంది. మగవాళ్లను ఊరికే హేళన చేయవద్దని.. ఇలా ఎందుకు చేస్తున్నావు ? అంటూ అనసూయపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది జోక్ కోసమే చేశానని అనసూయ ఆ వీడియో కింద కామెంట్ రూపంలో రాసుకొచ్చింది. కానీ ఇలాంటి విషయాలపై జోకులు వేయడం ఎందుకని కొందరు అంటున్నారు. మరి ఈ పోస్టుపై అనసూయ ఏమంటుందో చూడాలి.