Viral Photo : ఇటీవలి కాలంలో హీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. సినీ పరిశ్రమలో కెరీర్ తారాస్థాయిలో ఉండగానే పెళ్లి చేసుకొని సంసార బాధ్యతలను తలకెత్తుకొన్న హీరోయిన్ ఈమె కాగా, మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ నుంచి తెలుగు, తమిళ భాషల్లో పేరు తెచ్చుకొని హిందీ భాషలో తన సత్తాను చాటుకుంది. భారీ చిత్రాలు, అగ్ర హీరోలతో ఆఫర్లను సొంతం చేసుకొంటున్న సమయంలో హఠాత్తుగా సినీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పి అందరిని ఆశ్చర్య పరచింది. ఆమె ఎవరో గుర్తొచ్చే ఉంటుంది. మరెవరో కాదు అందాల అసిన్.
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న అసిన్ 1985 అక్టోబర్ 26న పుట్టింది. అసిన్ ఇప్పటికీ అందంగానే ఉంది. అసిన్ 15 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ప్రారంభించగా, 2001లో మలయాళ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించింది. రాహుల్ శర్మతో తన పెళ్లి చాలా చిత్రంగా జరిగిందని ఓ సందర్భంలో ఆసిన్ చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన హౌస్‌ఫుల్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో రాహుల్, అసిన్ కలుసుకొన్నారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసిందని, 2016 జనవరి 19న వారిద్దరూ పెళ్లి చేసుకొన్నట్టు చెప్పుకొచ్చింది.
మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను పెళ్లాడిన అసిన్.. 2017 అక్టోబర్‌లో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీకూతుళ్ల పుట్టిన రోజులకు మధ్యలో ఒకరోజు మాత్రమే గ్యాప్ ఉండటం విశేషం. అసిన్ బర్త్ డే అక్టోబర్ 26 కాగా.. అరిన్ బర్త్ డే అక్టోబర్ 24. కాగా, అమీర్ ఖాన్ తో గజినీలో నటించే అవకాశం అసిన్ కు ఆఫర్ రావడంతో తండ్రికి ఓకే చెప్పాడట. గజిని విజయం అసిన్‌ను విజయ శిఖరాలకు చేర్చింది. తెలుగులోను టాప్ హీరోలందరితో కలిసి నటించింది ఆసిన్. డాక్టర్ అవ్వాలనుకున్న ఆసిన్.. మోడలింగ్ లోకి వచ్చాక యాక్టర్ గా టర్న్ అయ్యింది. అలా హీరోయిన్ గా ఆసిన్ చేసిన మొదటి సినిమా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి. ఇక ఈ అమ్మడి చిన్ననాటి పిక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.