వినోదం

స్టార్ హీరోయిన్ పెదవి కొరికిన 42 ఏళ్ల హీరో… ఓ వైపు రక్తం కారుతున్నా వదలకుండా..!

మాములుగా కొందరు నటులు కెమెరా ముందుకు వెళ్లగానే తమను తాము మర్చిపోయి పాత్రలో జీవించేస్తుంటారు. డైరెక్టర్ కట్ చెప్తున్నా సరే.. ఆ పాత్రలో నుంచి బయటకురారు. అలాంటి ఓ సిచ్యువేషన్ స్టార్ హీరోయిన్‌కు ఎదురైంది. ఎంతలా అంటే.. లిప్ కిస్ సీన్‌ కోసం ఓ స్టార్ హీరోను ముద్దు పెట్టమంటే.. పెదవిని కొరికేశాడు. డైరెక్టర్ కట్ చెప్పినా సరే వదలకుండా అలానే పెదవి కొరికేశాడు. దాంతో ఆ హీరోయిన్‌కు రక్తం కూడా వచ్చేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా?.. తనే మాధురీ దీక్షిత్. మాధురీ దీక్షిత్ క్రేజ్, పాపులారిటీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ.. అసలు ఒకప్పుడు బాలీవుడ్‌ను ఊపేసింది.

మాధురీ దీక్షిత్ నటించిందంటే చాలు సినిమా హిట్టే అని అప్పట్లో ప్రొడ్యూసర్‌లు భావించేవాళ్లు. అంతెందుకు చాలా మంది హీరోలు అప్పట్లో మాధురీ దీక్షిత్ డేట్స్ కోసం ఎదురు చూసేవారు. అంతటి స్టార్ డమ్ అప్పట్లో ఆమెకు ఉండేది. ఇక ఇదిలా ఉంటే… ఈ అమ్మడి కెరీర్ స్టార్టింగ్‌లో ఓ చేదు అనుభవం ఎదురైంది. అదేంటంటే.. ఈ బ్యూటీ అప్పటి బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నాతో కలిసి దయావన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఓ లిప్ కిస్ సీన్ ఉంటుంది. అప్పట్లో ఈ లిప్ కిస్ సీన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు.. వినోద్ ఖన్నా, డైరెక్టర్ కట్ చెప్పినా సరే ఆ పాత్రలో లీనమైపోయి మాధురీ దీక్షిత్ పెదవిని గట్టిగా కొరికేశాడట.

bad incident happened in madhuri dixit life

దాంతో మాధురీ దీక్షిత్ పెదవి చిట్లి, రక్తం కారింది. ఈ దెబ్బతో యూనిట్ అంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా అలా వినోద్ ఖన్నా పెదవి కొరికేయడంతో ఏడ్చుకుంటూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. అయితే ఆ తర్వాత డైరెక్టర్‌తో పాటు వినోద్ ఖన్నా కూడా క్షమాపణలు చెప్పడంతో సినిమాని పూర్తి చేసింది. ఇక ఈ సినిమా చేసే టైమ్‌లో మాధురీ దీక్షిత్ వయసు కేవలం 20 ఏళ్లే. ఇక వినోద్ ఖన్నా ఏజ్ మాత్రం 42 ఏళ్లు. ఇక ఈ మూవీ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ నాయకుడు సినిమాకు రీమేక్. హిందీ రీమేక్ వెర్షన్‌కు ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించాడు.

Admin

Recent Posts