టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యంపై ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. కాగా చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో అభిమానులు ఆయన గురించి ఆందోళన చెందుతున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించిన ఈవెంట్‌లో చిరంజీవి అవార్డు అందుకున్నారు. కాగా ఈ ఈవెంట్‌లో చిరు అక్కడకు వచ్చేందుకు, మెట్లు ఎక్కేందుకు బాగా ఇబ్బంది పడ్డారు.
దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. చిరంజీవి గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిరు సార్‌ను ఇలాంటి పరిస్థితిలో పిలవాల్సి వచ్చింది.. అని అన్నారు. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరు త్వరగా కోలుకోవాలని GET WELL SOON అంటూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా చిరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిరు కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్, పెద్దకూతురు సుస్మిత, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. ఇక ప్రతినిధులతో కలిసి ఆమిర్ ఖాన్ హైదరాబాద్‌కి వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పేరు గిన్నిస్ బుక్‌లో అధికారికంగా నమోదు అవుతుందని ప్రకటించారు. చిరంజీవి 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 స్టెప్పులతో అలరించి గిన్నిస్ రికార్డు అందుకున్నారు.