వినోదం

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..!

ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్, హీరో, హీరోయిన్లు ఎంత అవసరమో, ప్రస్తుత కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే అవసరం అవుతున్నారు. కొన్ని సినిమాలైతే మ్యూజిక్ ద్వారానే హిట్ అవుతున్నాయి. ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి ప్రధానంగా ఉండేది మ్యూజిక్. ప్రస్తుతం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లు అంటే అంత పాపులారిటీ ఉంది. ఈ డైరెక్టర్లు కూడా ఏమాత్రం హీరోలకు తగ్గకుండా పారితోషికం కూడా తీసుకుంటున్నారట. మరి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటారో ఓ సారి చూద్దాం.

తమన్ :

మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తమన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించి, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నారు. అల వైకుంఠపురం సినిమా మ్యూజిక్ హిట్ అవడంతో ఆయనకు అనేక సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆయన ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్:

గతంలో ఒక్కో సినిమాకి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు దేవిశ్రీ. కానీ ప్రస్తుతం ఒక్క సినిమాకి మూడు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు అంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అవుతుంది.

do you know about the remuneration of these music directors

అనిరుధ్ రవిచందర్ :

అనిరుద్ మ్యూజిక్ అందించారు అంటే పెద్ద,చిన్న ఎవరైనా సరే చిందులు వేయాల్సిందే. మ్యాస్ట్రో సినిమాతో విజయాన్ని అందుకున్న అనిరుద్ ఈయన మొదటి సినిమాతో ఐదు లక్షల వరకు తీసుకున్నారు. ప్రస్తుతం రెండు కోట్ల యాభై లక్షల వరకు అందుకుంటున్నారు.

ఏఆర్ రెహమాన్:

ఏదైనా సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు అంటే చాలా గర్వంగా చెప్పుకుంటారు ఆ చిత్ర యూనిట్. ఆస్కార్ అవార్డు తో పాటు, గ్రామీ పురస్కారాలు అందుకున్న ఏ ఆర్ రెహమాన్, ఒక్కో సినిమాకి ఏడు నుంచి పది కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు.

ఎంఎం కీరవాణి :

తెలుగులో 200 సినిమాలకు మ్యూజిక్ అందించిన దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్. రాజమౌళి సినిమాతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈయన ఒక్కో సినిమాకి ఒకటిన్నర కోటి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్ మరియు తమన్ హవా నడుస్తోంది. వీరిద్దరూ ఏడాదికి దాదాపుగా 10 నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నారు.

Admin

Recent Posts