Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ధనుష్ : ఒక పూట తినడానికి దిక్కు లేని స్థితి.. కట్ చేస్తే తమిళ స్టారయ్యారు..ఎలా..?

Admin by Admin
January 31, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తమిళ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో పేరు సంపాదించారు హీరో ధనుష్.. తనదైన నటనతో అందరినీ మెప్పించి ఆకట్టుకుంటారు ఆయన.. అలాంటి హీరో ఒకానొక సమయంలో కనీసం ఒక పూట అన్నం తినడానికి కూడా దిక్కు లేని పరిస్థితి అనుభవించారట.. మరి ఆయన జీవితంలో ఏ విధంగా ఎదిగారో ఓ సారి చూద్దాం. ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ధనుష్ కి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య సెల్వరాఘవన్ ఉన్నారు. ఆయన కూడా దర్శకుడు. ఆయన తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,7/G బృందావన కాలనీ, సినిమాలకు దర్శకుడిగా చేశారు.

ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా తమిళంలో స్టార్ డైరెక్టర్. మంచి రైటర్ కూడా, ధనుష్ జన్మించేనాటికి వీరి కుటుంబం కటిక పేదరికం లో ఉంది. ధనుష్ తండ్రి ఒక మిల్లులో పని చేస్తూ ఎంతో కష్టపడే వారు. వీరంతా ఒక చిన్న గదిలో ఉండే వారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోజుకు ఒక్క పూట కూడా తినలేని పరిస్థితి ఉండేది. కస్తూరి రాజా ఒక్క రూపాయి బస్ చార్జి మిగిలడం కోసం పదకొండు కిలోమీటర్లు నడిచి వెళ్లే వారు. ధనుష్ ఐదు సంవత్సరాలు వచ్చే దాకా ఈ పరిస్థితి కొనసాగింది. కస్తూరి రాజా మిల్లులో పనిచేసే సమయంలో కథలు రాసేవారు. వాటిని 50 రూపాయలకు ఇతరులకు అమ్మేవారు.

do you know how dhanush became actor

ఈ విధంగా ఆయన రాసిన కథలను ఇతరులు కొనుక్కొని డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు ఎక్కువ రూపాయలకు అమ్ముకొని లాభాలు పొందేవారు. ఈ సందర్భంలోనే ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక ఆ విధంగా ఎంతో కష్టపడి డైరెక్టర్ గా ఎదిగారు. ఆ తర్వాత ధనుష్ టెన్త్ క్లాస్ వరకు బాగా చదివి తర్వాత ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయి తో లవ్ లో పడి తన చదువుకు దూరం అయ్యారు. ఇంటర్ ఫెయిల్ అయ్యారు. ఇది గమనించిన ఆయన తండ్రి చదువు రాదు అని చెప్పేసి, ముందుగా నాటకాలకు పంపించి తర్వాత సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఈ విధంగా ధనుష్ అంచలంచలుగా ఎదిగి ఒక స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నారు.

Tags: Dhanush
Previous Post

అమెరికాలో చదువుకున్న మన టాలీవుడ్ హీరోలు వీరే

Next Post

శాకాహారం తినడం వల్ల గుండెకు ఎంత మేలో తెలుసా..?

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.