Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 150కి పైఆ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో అధికశాతం చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. ఆయన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోగా, మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో చిరంజీవే వదులుకోవడం జరిగింది.
ఇలా చిరంజీవి ఇప్పటివరకు ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి. మరీ చిరంజీవి వదులుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దామా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మన్నెంలో మొనగాడు సినిమాను మొదటిగా చిరంజీవి వదులుకున్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను మొదట చిరంజీవితో చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే చిరంజీవికి స్టార్ హీరోగా ఇమేజ్ రావడంతో ఆ పాత్ర తనకు సెట్ అవ్వదని రిజెక్ట్ చేశాడు. ఇక ఆ అవకాశం యాక్షన్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూపర్ హిట్ అయింది.
వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మిద్దామని అనుకున్నారు. ఆ సమయంలో శ్రీదేవి పాత్ర ఎక్కువగా ఉండడంతోపాటు, ఆమె పుల్ బిజీగా ఉండడంతో ఆ సినిమా వదులుకున్నారు చిరంజీవి. అలా ఆఖరి పోరాటం చిత్ర అవకాశం కాస్త నాగార్జునకి దక్కింది. ఈ చిత్రంతో నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
ఇక ఈ చిత్రాలే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ నటించిన నెంబర్ వన్, మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ, వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి, రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను చిరంజీవి వదులుకున్నారు. ఈ 8 చిత్రాల్లో ఆంధ్రావాలా డిజాస్టర్‌గా నిలవగా, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయింది. ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. అలా పలు బ్లాక్ బస్టర్ మూవీలను చిరంజీవి మిస్ చేసుకున్నారు.