వినోదం

తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరి జగన్నాథ్ కు పెళ్లి చేసిన నటి యాంకర్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరిజగన్నాథ్ ఇప్పటికే ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.. ఆయన డైరెక్షన్ లో చేసిన అల్లు అర్జున్,రవితేజ, ప్రభాస్,మహేష్ బాబు లాంటి హీరోలు హిట్స్ అందుకొని స్టార్ హీరోల గా కొనసాగుతున్నారు. అలాంటి పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట. తన పెళ్లి సమయంలో కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరికి ఆ నటి మరియు యాంకర్ ఎంతో సహాయం చేశారని పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు మరి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. పూరి జగన్నాథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన లావణ్య అనే ఆవిడను ప్రేమించి పెళ్లాడారు..

అయితే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయమది. ఇదే సమయంలో లావణ్య పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో గుడిలోకి వెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన దగ్గర మూడు ముళ్ళు వేయడానికి కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారట. ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొన్నారని, నటి హేమ పెళ్లి బట్టలు కొనిపెట్టారని పలు సందర్భాల్లో పూరి జగన్నాథ్ తెలియజేసారు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ ను ఇతరాత్రా సహాయం అందించారట.

do you know that puri jagannadh once faced money problems

ఇక వివాహం తర్వాత మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలో ఎదిగారు. మంచి పేరు తో స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నారు.. చివరికి కొంతమంది స్నేహితులను నమ్మి తీవ్రంగా మోసపోయారు పూరి జగన్నాథ్. తను సంపాదించిన ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. ఏది ఏమైనా తన పెళ్లికి సహాయం చేసిన ఝాన్సీ మరియు హేమ లను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను అని పూరి జగన్నాథ్ అంటుంటారు.

Admin

Recent Posts