వినోదం

ఈ మూవీస్ వల్ల ఫేమస్ అయిన 10 ప్రదేశాలు.. వెళ్లాలనుకునేవారు ఓ లుక్కేయండి..!

కొన్ని సినిమాల్లో మనం హీరో హీరోయిన్స్ కన్నా వారు ఉండే లొకేషన్స్ ని ఎక్కువ ఇష్టపడతాం. కొంతమంది సినిమాలో హీరో లేదా హీరోయిన్ నివసించే ఇల్లు చూసి అబ్బా ఎంత బాగుందో అంటాం. అలా కొన్ని సీన్స్ కొన్ని కొన్ని ప్లేస్ లకి తీసుకెళ్లి చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశాల్లో హీరోహీరోయిన్ల కంటే మనం ఆ ప్లేస్ లనే ఎక్కువగా ఇష్టపడతాం. ఈ విధంగా సినిమాల వల్లే ఎక్కువ పేరు వచ్చిన ప్రదేశాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..

ఏం మాయ చేసావే – అలెప్పి.. ఈ సినిమాలో కేరళలోని అలెప్పీ ప్రాంతాన్ని ఎక్కువగా చూపిస్తారు. కొబ్బరి చెట్లు, నీటిలో పడవ ప్రయాణం, చర్చిలు ఒకటా రెండా ఆ ప్రదేశం చూస్తుంటే మనకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఓసారి వెళ్లి చూస్తే బాగుండు అనే ఆలోచన కూడా వస్తుంది. దేశముదురు – మనాలి : ఈ సినిమా ద్వారా మనాలి ప్రాంతం చాలా ఫేమస్ అయ్యింది. హన్సిక అడవిలో ఒక గుహ వద్ద మెడిటేషన్ చేయడం, బ్రిడ్జ్ ఇలా అనేక ప్రదేశాలు కళ్లకు కట్టినట్టుగా ఉంటాయి. ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది ఫ్యామిలీతో మనాలి ట్రిప్ వెళ్లారట.

do you know that these places became famous after these movies

గోదావరి-పాపికొండలు.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన సినిమా గోదావరిలో పాపికొండలని చూపించారు. ఇది చూస్తే తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఏనే-గోవా.. ఈ జీవితాన్ని కథల రూపంలో తీయడంలో తరుణ్ భాస్కర్ దిట్ట. ఈయన కూడా ఈ సినిమాలో గోవా ప్రాంతాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఎవడే సుబ్రహ్మణ్యం – దూద్ కాశీ : ఈ సినిమాలో మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చగలిగే శక్తి ప్రయాణానికి ఉంది అని నిరూపించే కథ ఉంది. దూద్ కాశీలో ప్రయాణం చల్లగాలిలో పాటలు, మంచు కొండలు ఎంత హాయిగా ఉంటాయో.. ఖలేజా-రాజస్థాన్.. రాజస్థాన్ చూడనివారు ఖలేజా సినిమాలో చూడవచ్చు. ఇందులో మహేష్ బాబు ఎడారిలో నడవటం అక్కడి సీన్స్ చాలా భలేగా ఉంటాయి.

హ్యాపీ డేస్ – అరకు.. ఈ సినిమాలో ఒక పాట సమయంలో అరకు చూపిస్తారు. వాళ్ళు వేసే ప్లానింగ్స్,ఒప్పందాలు మనం బయట ఎలా చేసుకుంటామో అలాగే ఉంటాయి.. మీరు కూడా ఓసారి అరకు వెళ్లి చూడండి. అర్జున్ -మధురై : అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి అమ్మవారి గుడి చూసినవారంతా తర్వాత టికెట్ బుక్ చేసుకొని మరీ మధురై వెళ్లారు. చూడాలని ఉంది-కలకత్తా.. ఈ సినిమాలో చిరంజీవి చేసిన ఒక పాటలో మొత్తం కలకత్తా చూపిస్తారు. ఆలస్యం ఎందుకు ఆ పాటలో మీరు కూడా కలకత్తాను చూసేయండి. సొంతం-కాశ్మీర్ : ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ అక్కడ మంచులో దొర్లుతూ ఉంటే మనకు కూడా అలా చేయాలనిపిస్తుంది. ఓయ్- వైజాగ్.. ఓయ్ సినిమా లో వైజాగ్ నగర అందాలను మొత్తం కూడా చూపిస్తారు.

Admin

Recent Posts