టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ లలో రాశి ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రాశికన్నా పరిచయం అయింది. తొలిప్రేమ సినిమా కూడా రాశి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ బ్యూటీ.. జోరు అలాగే విలన్ సినిమా టైటిల్ సాంగ్స్ లో ప్లే బ్యాక్ సింగర్ గా పాడింది. అంతేకాదు బాలకృష్ణుడు సినిమా, జవాన్ లోను వాయిస్ ఇచ్చింది. ఆండ్రియా కూడా హీరోయిన్ కాకముందు పాపులర్ సింగర్. ఆమె అంత ఫ్యాషన్ తో.. మరే ఇతర హీరోయిన్ పడలేదు. నటిగా కూడా ఈమె ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అపరిచితుడు, బొమ్మరిల్లు, దడ, భరత్ అనే నేను సినిమాలో పాటకు ఈ బ్యూటీ వాయిస్ ఇచ్చింది. ఈ పాటలన్నీ బంపర్ హిట్ అయ్యాయి.
మమతా మోహన్ దాస్ కూడా అభినయం ఉన్న నటి. మంచి సింగర్. ఈమె చాలా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నారు. వాటిలో పేరు తెచ్చినవి రాఖీ టైటిల్ సాంగ్, శంకర్దాదా జిందాబాద్ లో ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్, జగడం సినిమాలో పాటలు ఉన్నాయి. అలా మొదలైంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యామీనన్. సినిమాల్లో హీరోయిన్ కాకముందు మంచి సింగర్. ఇష్క్, 24, గుండెజారి గల్లంతయింది మరియు జబర్దస్త్ లాంటి సినిమాలలో సింగర్ గా తన టాలెంట్ ను బయటపెట్టింది నిత్యా మీనన్.
అగ్ర నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. ఈ బ్యూటీ హీరోయిన్ కాకముందు పాటలు కూడా పాడారు. హే రామ్, ఈనాడు, లక్, ఓ మై ఫ్రెండ్, ఆగడు, రేసుగుర్రం సినిమాలతో శృతిహాసన్ సింగర్ గా ప్రూవ్ చేసుకున్నారు.