సినిమా వాళ్ళకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది సినీ తారలు, రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో మన తెలుగు నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టడం మామూలు విషయం కాదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది ఎన్టీఆర్ కు సమకాలిన నటుడు ఎంజి రామచంద్రన్ కూడా అక్కడ తన ప్రభావం చూపించి రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు.
జయలలిత కూడా దాదాపు 13 ఏళ్లు సీఎం గా చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రాజకీయాల్లో కూడా రానించి సినిమా వారి విలువేంటో నిరూపించారు. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చేయి కాల్చుకున్నారు. కేవలం 18 స్థానాలు గెలుచుకున్న తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్లీ సినిమాల వైపు వెళ్లారు.
ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం 2014లో జనసేన పార్టీ స్థాపించిన ప్రజల్లో ప్రాచుర్యం పొందలేదు. ఫలితంగా ఓటమి చవిచూసినా ప్రస్తుతం ఏపీలో తన ప్రభావం చూపిస్తున్నారు.
ఇంకా వీరే కాకుండా తమిళంలో కమల్ హాసన్ కూడా గత ఎన్నికల్లో పార్టీ స్థాపించి పోటీలో నిలిచిన ఎక్కడా కూడా విజయం సాధించక దుకాణం మూసుకున్నారు. ఇదే కోవలో విజయకాంత్, కార్తీక్, విజయ్ లాంటి వారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఫెయిల్ అయ్యారు. కానీ సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.