వినోదం

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్స్ గానే ఉన్నాయి. అయితే కొన్ని చిత్రాలు మొద‌ట ఆద‌ర‌ణ ద‌క్కించుకోన‌ప్ప‌టికీ త‌ర్వాత త‌ర్వాత మాత్రం మంచి హిట్ సాధించాయి. అలాంటి చిత్రాల‌లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య ఒక‌టి. ఇంట్లో భార్య అంటే విప‌రీత‌మైన అభిమానం క‌న‌బ‌రుస్తూ.. మ‌రో స్త్రీ మాట త‌ల‌పెట్ట‌కుండా బ‌య‌టికి వెళ్ల‌గానే ద‌ర్శ‌కుని అవ‌తారమెత్తి ప‌రాయి స్త్రీల‌తో ఆనందం కోసం వెంప‌ర్లాడే మ‌గ‌వాడిని ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య అన‌డం కాదు.. ఆ నానుడినే ప్ర‌ధాన అంశంగా తీసుకొని అదే టైటిల్‌తో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించారు.

1982 ఏప్రిల్ 23న విడుద‌లైంది. తొలుత ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత కాల‌క్ర‌మేణా ప్రేక్ష‌కాధ‌ర‌ణ పెరిగి సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 512వ రోజు సినిమాగా నిలిచింది. అప్ప‌టికే యాక్ష‌న్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవిని రాజ‌శేఖ‌ర్ అనే హాస్యం మెళ‌వించిన ఫ్యామిలీ క్యారెక్ట‌ర్ లో మెప్పించ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇందులో చిరంజీవి, మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు. ఇది దర్శకుడిగా కోడి రామకృష్ణకు, నటుడిగా గొల్లపూడి మారుతీ రావుకు తొలిచిత్రం.ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించాడు.

do you know that this chiranjeevi movie completed in 29 days

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. దీన్నే తమిళంలో వీటుల రామన్ వెలియిల కృష్ణన్ పేరుతోనూ, కన్నడంలో మనెలి రామణ్ణ బీధీలి కామణ్ణ (1983), హిందీలో ఘర్ మే రాం గలీ మే శ్యామ్ పేరుతో పునర్నిర్మాణం చేశారు. ఈ రోజుల్లో ఒక షూటింగ్ అంటే సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి స‌మ‌యం ప‌డుతుంది. కాని ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాని కేవ‌లం 29 పని దినాల్లో పూర్తి చేశారు రాఘ‌వ గారు. రూ.3ల‌క్ష‌ల 20వేల వ్య‌యంతో ఈ చిత్రాన్ని పాల‌కొల్లు, న‌ర్సాపురం, పోడూరు, స‌కినేటిప‌ల్లి, భీమ‌వ‌రం, మ‌ద్రాస్‌ల్లో సినిమా షూటింగ్ జ‌రిపారు. అనేక ఇబ్బందులు ఈ చిత్రానికి ఎదురైన కూడా వాటితో పోరాడి చిత్రంతో మంచి విజ‌యం సాధించారు రాఘ‌వ‌. జే.వీ.రాఘ‌వులు స్వ‌రాలు సినిమాకు అద‌న‌పు బ‌లంగా మారాయి.

Admin

Recent Posts