సోషల్ మీడియాలో ఇటీవల సెలబ్రిటీలకి సంబంధించి అనేక ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోతున్నాయి. కొందరు చిన్నప్పుడు ఇప్పుడు ఒకే పోలికలతో కనిపిస్తుండడంతో ఇట్టే గుర్తు పట్టేస్తారు. మరి కొందరు మాత్రం గుర్తు పట్టకుండా మారిపోతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్‌చల్ చేస్తుంది. ఇందులో స్టార్ హీరోలు ఉన్నారు. వారు మెగా, అల్లు వారసులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన తమ్ముడు అల్లు శిరీష్, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఆయన కుమార్తె సుస్మిత కొణెదల ఉన్నారు.
ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. సుస్మిత క్యూట్‌గా కనిపిస్తుండగా, అల్లు శిరీష్ మాత్రం ఏదో సందడి చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఏదో సందర్భంలో ఈ నలుగురు కలిసినట్టు తెలుస్తుండగా, వీరిని ఇలా చూసి మెగా అల్లు అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే గంగోత్రితో సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆయన పుష్పతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుతతో వచ్చిన చిరు బిడ్ద రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్‌కు చేరారు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన చరణ్ రానున్న రోజులలొ అంతకు మించిన సినిమాలతో రచ్చ చేయబోతున్నాడు. అల్లు శిరీష్ పలు సినిమాలతో మెప్పించారు. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్డడంతో.. ఆశించిన రేంజ్‌ను అందుకోలేకపోయారు. ఇటు సుస్మిత వివాహం చేసుకున్నప్పటికీ.. తన తండ్రి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా మారింది. ప్రస్తుతం భర్తతో కలిసి నిర్మాణం చూసుకుంటుంది.