సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని, వివాదాలకు పోనీ, హంగు ఆర్భాటాలు ఇష్టంలేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది విక్టరీ వెంకటేష్ మాత్రమే. ఆయన ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సంవత్సరాలు గడిచింది. 1971 లో ఏఎన్ఆర్ హీరోగా నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో మొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. అయితే వెంకటేష్ కెరియర్ లో కూడా బిజీ షెడ్యూల్ వల్లనో, లేదంటే కథ నచ్చక తన 35 ఏళ్ళ కెరీర్లో రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం..
1. రోజా.. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో ముందుగా హీరో వెంకటేష్ అనుకున్నారు. కానీ ఏదో కారణం వల్ల వెంకీ మూవీ ని రిజెక్ట్ చేశారు. 2. ఒకే ఒక్కడు.. శంకర్ డైరెక్షన్ లో ఈ మూవీ ముందుగా విజయ్ దగ్గరికి వెళ్లిందట, ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో వెంకటేష్ ను సంప్రదించారు శంకర్. కానీ వెంకీ కూడా చాలా సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇది కాస్త అర్జున్ తో చేసి సూపర్ హిట్ కొట్టారు. 3. సంతోషం.. ఈ సినిమా కథని మొదటగా డైరెక్టర్ దశరథ్, వెంకటేష్ సురేష్ బాబుకి వినిపించారు. కానీ వెంకీ ఈ సినిమాని ఎందుకో రిజెక్ట్ చేశారు. 4. ఖడ్గం.. ఖడ్గం మూవీ లో శ్రీకాంత్ పాత్రకు ముందుగా వెంకటేష్ ను అనుకున్నారు కానీ, ఆ సమయంలో కూడా వెంకీ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో రిజెక్ట్ చేశారు.
5. కృష్ణం వందే జగద్గురుమ్.. ఈ సినిమాని ముందుగా వెంకీతో చేయాలనుకున్నారట. కానీ ఆయన రిజెక్ట్ చేయడం తో రానా ఈ సినిమా చేశారు. 6. గోవిందుడు అందరివాడేలే.. రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్రకు ముందుగా వెంకటేష్ అనుకున్నారట దర్శకుడు కృష్ణ వంశీ. కానీ వెంకటేష్ దీన్ని కూడా రిజెక్ట్ చేశారు. 7. ఆడవాళ్ళు మీకు జోహార్లు.. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ కథ ముందుగా వెంకటేష్ కు చెప్పారట. కానీ ఆయన దీనికి ఇంట్రస్ట్ చూపలేదు. 8. “కర్ణన్” రీమేక్.. ఈ సినిమాని ముందుగా వెంకటేష్ తో రిమెక్ చేయాలనుకున్నారట.. కానీ వెంకీకి కథ నచ్చకపోవడంతో ఇది కాస్త బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళింది.