గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇంతింతై అన్నట్లుగా దూసుకుపోతుంది. బాహుబలి తో టాలీవుడ్ సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఏడాదికి ఆ ఏడాది సినిమాలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోతుంది. అదే స్థాయిలో ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది. #1 ఆర్.ఆర్.ఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 10200 కు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. #2 బాహుబలి 2.. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8700 కి పైగా స్క్రీన్స్ లలో విడుదల అయ్యింది. #3 సాహో.. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7978 స్క్రీన్స్ లో భారీగా విడుదలైంది.
#4 రాధేశ్యామ్.. ప్రభాస్ హీరోగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7010 స్క్రీన్ లలో విడుదలైంది. #5 సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4650 కి పైగా స్క్రీన్స్ లలో విడుదలైంది. #6 బాహుబలి ది బిగినింగ్.. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రానా కీలక పాత్రలో తిరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4000 కి పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.
#7 పుష్ప ది బిగినింగ్.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో తిరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3000 కి పైగా స్క్రీన్స్ లో విడుదల అయింది.