Akhanda Movie : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం అఖండ . ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మురళీకృష్ణ, శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అఘోర పాత్రలో అయితే అదరగొట్టేశాడు. ఆ పాత్ర బాలయ్య తప్ప ఇంకే హీరో చేయలేనంతగా అదరగొట్టాడు.
అయితే ఈ సినిమాకి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేయకముందు మహర్జాతకుడు అనే టైటిల్‌ను అనుకున్నారట. ఈ కథను 2014వ సంవత్సరంలోనే వినిపించారట. అప్పటి నుండి కథపై కసరత్తులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టైటిల్ ఎందుకు మార్చారు అని నిర్మాతలని అడగగా, దానికి నిర్మాత సమాధానం ఇస్తూ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అని రిలీజ్‌కి ముందు నిర్మాత స్పష్టం చేశారు. ఇక అఖండ సినిమా విషయంలో లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేసింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత బడా స్టార్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న సమయంలో బాలయ్య బెదరకుండా ‘అఖండ’ సినిమాను రిలీజ్ చేసి మిగతా బడా స్టార్ హీరోలకు భరోసా ఇచ్చారు. కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే విషయం ‘అఖండ’లో ప్రూవ్ చేసారు. ఒక రకంగా బాలయ్య ‘అఖండ’ సక్సెస్‌తో మిగతా హీరోలు ఊపిరి పీల్చుకొని తమ సినిమాలు రిలీజ్ చేశారు.