Keerthi Reddy : పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం తొలి ప్రేమ. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఇక ఇందులో కథానాయికగా నటించి అందరి మనసులు గెలుచుకుంది కీర్తి రెడ్డి. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కీర్తి. అయితే ఆ తరువాత అనుకున్న స్థాయిలో కెరీర్ లో రాణించలేకపోయింది. నాగార్జునతో రావోయి చందమామ, మహేష్ బాబుతో అర్జున్ వంటి సినిమాల్లో కీర్తి రెడ్డి నటించింది.
టాలీవుడ్ లో ఛాన్స్ రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళింది కీర్తి రెడ్డి. అక్కడ కూడా రెండు మూడు సినిమాలు తీసి మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ సుమంత్, కీర్తి కొద్ది రోజులకే విడిపోయారు. ఇక ఆ తర్వాత కీర్తి ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే కీర్తి రెడ్డి తమ్ముడు కూడా సినిమాల్లో హీరోగా నటించాడు.
ప్రస్తుతం కీర్తికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సినిమాల్లో పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయినా జీవితంలో మాత్రం కీర్తి రెడ్డి సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమంత్ తో విడాకులు తీసుకున్న తర్వాత కీర్తి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సుమంత్ ను పెళ్లి చేసుకుని ఉండకపోయి ఉంటే తన జీవితం ఇంకా బాగుండేదని కామెంట్స్ చేసింది. కీర్తి రెడ్డి, మంచు లక్ష్మి, సమంతలకు స్నేహితురాలు అయిన శిల్పారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో సందడి చేస్తుంటుంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో సైతం అలరించే ప్రయత్నం చేస్తుంటుంది.