వినోదం

నటి సూర్యకాంతం భర్త ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేది నటి సూర్యకాంతం&period; ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది&period; ఒకప్పుడు సూర్యకాంతం డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారు&period; ఆమె డేట్స్ కోసం సినిమా షూటింగ్ లను సైతం వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట&period; సూర్యకాంతం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియదు కానీ అప్పట్లో ఈమె చాలా ఫేమస్&period; అప్పట్లో అత్త పాత్ర చేయాలంటే కచ్చితంగా సూర్యకాంతం పేరు చెప్పేవారు చాలామంది&period; అయితే సినిమాలలో గయ్యాళి పాత్రలో నటించినప్పటికీ ఆమె నిజ జీవితంలో మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్న వెంకటకృష్ణ రాయపురంలో 1924 అక్టోబర్ 28న ఆమె తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది&period; సినిమాల్లో నటించాలని కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది&period; ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలుపెట్టి దాదాపు 40 సంవత్సరాలు పాటు తన సినీ ప్రస్థానంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు&period; అయితే అప్పటి మద్రాస్ హైకోర్టు జడ్జిని వివాహం చేసుకున్నారు సూర్యకాంతం&period; తద్వారా ఆమె మద్రాసులో నివసించాల్సి వచ్చింది&period; ఆ తరువాత హైదరాబాద్ లో ఇంటిని నిర్మించుకొని చివరి వరకు హైదరాబాదులోనే ఉన్నారు&period; అంతేకాదు హైదరాబాద్&comma; కాకినాడ తో పాటు ఇతర ప్రాంతాలలో సత్రాలను ఏర్పాటు చేసి అనాధలను చేరదీశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89544 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;suryakantham&period;jpg" alt&equals;"do you know who is suryakantham husband " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా చెన్నైలో ఎంతోమంది భర్తలేని స్త్రీలను ఆర్థికంగా ఆదుకున్నారట సూర్యకాంతం&period; అయితే వృత్తిరీత్యా సూర్యకాంతం భర్త జడ్జ్ అయినప్పటికీ షూటింగ్ లో సూర్యకాంతం బిజీగా ఉంటే ఆమె కోసం స్టూడియోల ముందు వేచి చూసేవారట&period; సూర్యకాంతం భర్తకి బయటి భోజనం తినే అలవాటు లేదట&period; దాంతో సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పని మొత్తం పూర్తి చేసి వెళ్లేదట సూర్యకాంతం&period; అయితే హైదరాబాద్&comma; విశాఖపట్నం&comma; చెన్నై నగరాల్లో ఇప్పటికీ సూర్యకాంతం నిర్మించిన సత్రాలు&comma; పాఠశాలలు ఎంతో మందిని ఆదరించి సేవలను అందిస్తున్నాయి&period; సూర్యకాంతం తన చివరి శ్వాస వరకు ఎంతో ఉన్నతంగా బతికి నలుగురిని బ్రతికించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts