Balakrishna : యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. అయితే రాజశేఖర్ కెరీర్ డల్ అయింది కానీ ఒకప్పుడు ఆయన తీసిన వరుస సినిమాలు హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాల్లో సింహ రాశి ఒకటి. అయితే ఇది వాస్తవానికి బాలయ్య మూవీనట. ఆయన ఈ మూవీని చేయాల్సి ఉంది. కానీ రిజెక్ట్ చేశారు. అది ఎందుకు అలా జరిగింది.. అంటే..
అప్పట్లో బాలకృష్ణ సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీలను తీసి వరుస హిట్స్ కొట్టి మంచి జోరుమీదున్నారు. అయితే ఆయన తరువాత కూడా అలాంటి మూవీలనే చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మదర్ సెంటిమెంట్ కలిగిన సింహరాశి మూవీని చేయాలని దర్శకుడు వి.సముద్ర బాలయ్యను సంప్రదించారట. కానీ బాలయ్య మాత్రం ఫ్యాక్షన్ సినిమా చేద్దాం అన్నారట. అలా చెన్నకేశవ రెడ్డి కథను సిద్ధం చేశారు. దానికి వి.సముద్రను డైరెక్ట్ చేయమని బాలయ్య అడిగారట. కానీ సింహరాశి చేద్దామని పట్టుబట్టడంతో బాలయ్య ఆ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తరువాత చెన్న కేశవరెడ్డి మూవీనే వినాయక్‌తో చేశారు.
ఇక బాలయ్య రిజెక్ట్ చేసిన మూవీని వి.సముద్ర రాజశేఖర్‌కు వినిపించారు. దీంతో ఆయనకు కథ నచ్చి ఓకే అన్నారు. అలా సింహరాశి ప్రారంభం అయింది. ఇందులో తల్లి సెంటిమెంట్‌ను ఎంతో బాగా చూపించారు. ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రాజశేఖర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. కానీ అదే సమయంలో తీసిన చెన్నకేశవరెడ్డి మాత్రం ఫ్లాప్ అయింది. తరువాత బాలకృష్ణ వరుసగా మళ్లీ ఫ్యాక్షన్ మూవీలనే చేశారు. కానీ ఏదీ హిట్ కాలేదు. చివరకు ఆయన తన సినిమా కథలను మార్చారు. కానీ సింహరాశి మూవీని బాలయ్య చేసి ఉంటే.. ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది.