ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చాలా మంది పెరిగి పెద్దయ్యాక తమ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొందరు హీరో, హీరోయిన్స్ గా రాణించే ప్రయత్నం చేస్తుండగా మరి కొందరు మాత్రం సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తున్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ ఒకబ్బాయి యాక్ట్ చేశారు. హీరోయిన్ త్రిష.. సినిమాలో ఆ పిల్లాడిని చిట్టెలుక అని పిలుస్తూ సందడి చేస్తూ ఉంటుంది.
త్రిష.. చిట్టెలుక అని పిలిచిన పిల్లాడి పేరే అర్మాన్. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తున్న అతడు ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కనిపించాడు. దీంతో అతడు ఎవరా అని వెతుకులాట మొదలు పెట్టారు. అయితే ఇవి అర్మాన్ అకౌంట్ లో ఎక్కడా లేవు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అతను చిరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు కదా అని ముచ్చటించుకుంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి.. టైమ్ ఉన్నప్పుడు షూటింగ్ కు వచ్చి వెళ్తుంటారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు.