Ram Charan : చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగింది. ఇక త్వరలో తండ్రి కూడా అయ్యాడు. ప్రస్తుతం చరణ్‌కి మంచి టైం నడుస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవల తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు చరణ్. ఆ రోజ ఆయన పుట్టినరోజు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైందో అప్పటినుండి ఎన్టీఆర్,రామ్ చరణ్ ల పేర్లు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తొలి సినిమాలో కాస్త డిఫరెంట్‌గా కనిపించాడు. అచ్చం అమ్మాయి లాగే ఉండేవారు. అంతేకాదు ఆయన తన బాడీ,ఫేస్ కట్ అవుట్ వల్ల చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడు. అంతే కాదు అప్పట్లో ఆయనను చాలామంది చిరంజీవి కొడుకు అయితే ఎలాగున్నా హీరో అయిపోతారా అని హేళన చేసేవారు. ఇక వారన్న మాటలన్నీ దిగమింగుకొని ఎంతో స్టైలిష్ గా మారి గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అంతేకాదు హాలీవుడ్ మీడియాలో సైతం రామ్ చరణ్ తన అందంతో అందరిని కట్టిపడేశాడు.
మొదట్లో దారుణంగా ఉండే రామ్ చరణ్ అంత అందంగా..హ్యాండ్సమ్ గా.. స్టైలిష్ గా.. మారడానికి తన మొహంలో ఉండే దవడలకు, గడ్డానికి సర్జరీ చేయించుకున్నాడట. ఈ సర్జరీ ముంబైలో చేసుకున్నట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ మొదటి ఫోటోలు అలాగే ఇప్పుడున్న ఫోటోలు గమనిస్తే ఆ ఫోటోలలో ఈయన సర్జరీ చేయించుకున్నట్టు స్పష్టంగా తేడాలు గుర్తించవచ్చు. ఇక మొదట్లో ఎవరైతే ఈయన హీరోనా అని హేళన చేసిన వాళ్లే ప్రస్తుతం ఆయనను పొగుడుతున్నారు. అయితే యండమూరి వీరేంద్రనాథ్, కళాశాలలో ఓ సారి విద్యార్థులతో మాట్లాడుతూ, రామ్ చరణ్ తన చిన్నతనం నుండి నటుడిగా మారాలని అనుకున్నాడని, అయితే అతని గడ్డం విచిత్రంగా ఉందని, అతను ప్లాస్టిక్ సర్జరీని ఎంచుకున్నాడని అన్నాడు.