Aditi Govitrikar : సినిమా ఇండస్ట్రీ అనేది కొత్త రంగుల కళా ప్రపంచం.. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరి స్థానం పర్మినెంట్ గా ఉంటుందనేది చెప్పలేదం. ఇందులో రాణించాలంటే అందం, నటనా అభినయంతో పాటుగా టాలెంట్ కూడా చాలా ఉండాలి. ఒక్కోసారి ఎంత అందం ఉన్న అదృష్టం లేకపోతే రాణించడం కష్టం. ఏ ఇండస్ట్రీ అయినా సరే పాతవారు వెళుతుంటే కొత్తవారు వస్తూనే ఉన్నారు. అయితే 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో డెబ్యూ చేసిన హీరోయిన్.. ఆ ఒక్క సినిమా తర్వాత తెలుగులో కనిపించకుండా కనుమరుగు అయింది. మరి ఆ హీరోయిన్ ఎవరు అనే కదా మీ డౌట్.. అదితి గోవత్రికర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమాతో డెబ్యూ చేసింది.
తమ్ముడు సినిమాలో ప్రీతి జింగానియా కాకుండా.. లవ్లీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె అదితి గోవత్రికర్. ఈ చిత్రంలో వయ్యారి భామ ని హంస నడక అనే పాట అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. తమ్ముడు సినిమా అనగానే.. పవన్ కళ్యాణ్, ప్రీతీలతో పాటు లవ్ లీ క్యారెక్టర్ ని ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి.అదితి తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. ఇంపాక్ట్ మాత్రం బాగానే క్రియేట్ చేసింది. మహారాష్ట్రలోని పన్వేల్ ఏరియాలో పుట్టిపెరిగిన అదితి.. చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది.
తెలుగులో తమ్ముడు సినిమాతో యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది.. ఇక సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే మెడిసిన్ పూర్తిచేసిన అదితి కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ముజఫర్ అనే వ్యక్తితో ఏడేళ్లు డేటింగ్ చేసి, 1998లో అతన్ని వివాహం చేసుకుంది.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా.. ఆ తర్వాత 2009లో వివిధ కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు… పెళ్లి తర్వాత కూడా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆదితి.. తాజాగా వెబ్ సిరీస్, టీవీ షోలలో మెరుస్తోంది.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా హల్‌చల్ చేస్తుంది. అదితిని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.