ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ టాప్ ఫైవ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆ స్టార్డమ్ ఆషామాషీగా రాలేదు. ఎంతో కష్టపడి అభిమానుల మనసులను మెప్పించుకొని ఇంతటి స్టార్ గా ఎదిగాడు. అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు. ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే. ఇదంత పక్కకు పెడితే, ఇక బాలయ్య, వసుంధర వైవాహిక జీవితం విషయానికొస్తే, బాలయ్యకు పెళ్లి జరిగి నాలుగు దశాబ్దాలు పూర్తి అయింది. ఇక ఇప్పుడు వీరి శుభలేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వసుంధర కుటుంబం ఈ శుభలేఖను ప్రింట్ చేయించారు.
కాకినాడ వాస్తవ్యులు దేవరపల్లి సూర్యరావు, దేవరపల్లి ప్రమీల రాణి దంపతుల ద్వితీయ కుమార్తెను భాగ్యనగరం వాస్తవ్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పంచమ పుత్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్నట్టుగా అందులో ఉంది. 8వ తేదీ పగలు 12:41 నిమిషాలకు పెళ్లి జరిగింది. తిరుపతిలో కర్ణాటక కళ్యాణమండపంలో వీరి పెళ్లి జరిగింది. అయితే ఇప్పుడు బాలయ్య, వసుంధర ల పెళ్లి పత్రిక వైరల్ అవుతోంది. బాలయ్య, వసుంధర ల పెళ్లి పత్రిక చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కాగా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఈ మధ్యే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2లో నటిస్తున్నారు.