ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్లకు మహా అంటే ఐదు నుంచి పది సంవత్సరాలు నటించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే వారు టాలెంట్ ను ఉపయోగించుకొని వారి జీవితాన్ని సెట్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో కొంత మంది అలా వచ్చి ఒకే సారి సూపర్ హిట్ కొట్టి, కొద్దిరోజుల్లోనే మళ్లీ ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు కనుమరుగైపోయి మర్చిపోతున్న హీరోయిన్లలో దీక్షాసేత్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె పేరు వింటే ఓహొ నిజమే అని మనం గుర్తు చేసుకుంటాం.
వేదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సినిమాలో అవకాశం రావడం జరిగింది. దింతో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాతో మంచి పేరు రావడంతో దీక్షాసేథ్ వరస సినిమాలతో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో మిరపకాయ్, వాంటెడ్ లో నటించింది. మిరపకాయి సినిమాలో మంచి గుర్తింపు లభించిన తర్వాత వచ్చిన వాంటెడ్ తదితర చిత్రాలు పెద్దగా హిట్ కాకపోవడంతో సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక సినిమాలో నటించిన అది కూడా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి దూరం అయిపోతూ వచ్చింది. దాదాపుగా ఆమెను మరిచిపోయాం అనుకున్న సమయంలోనే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు తను కొత్త గెటప్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు దీక్షాసేతేనా మరి ఇలా తయారైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.