పెళ్లి అంటేనే నూరేళ్లపంట. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన పండుగ. అయితే, తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు టాప్ హీరోలు సైతం మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్నారు. పాతతరం హీరోల్లో చాలామంది సొంత మరదలిని, మేనకోడళ్లను పెళ్లి చేసుకున్నారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ రారాజుగా ఉంటారు. ఆయన తన సొంత మేనమామ కుమార్తె అయిన బసవరామతారకం ను పెళ్లి చేసుకున్నాడు. బసవతారకం కు కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం అట. ఆమె కూడా పట్టుబట్టి మరి ఎన్టీఆర్ ను పెళ్లాడారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మరదలు అయినా ఇందిరా దేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
అప్పటికే ఆయన సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్న ఇందిర కుటుంబ సభ్యులు సైతం ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణ సినిమాల్లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్య ఇందిరాను మాత్రం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం తన మరదలు నిర్మలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు.
మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీంతో అప్పటికే పుట్టిన విష్ణు, లక్ష్మి ప్రసన్న కోసం తన భార్య చెల్లి అయిన నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి మనోజ్ పుట్టాడు. దశాబ్దాలుగా వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. ఇక ఈ తరం జనరేషన్ లో డైలాగ్ కింగ్ సాయికుమార్ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆది సాయికుమార్ కూడా సొంత మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా తన సొంత మరదలు అయిన రజిని పెళ్లి చేసుకున్నాడు.