Balakrishna : సినీ ప్రపంచంలో నందమూరి బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలో నటన ఇరగదీయడంలో బాలయ్యదే పైచేయి అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అనేక బాలయ్య మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది హీరోలు ఇతర భాషలకు చెందిన సినిమాలను రీమేక్ చేస్తుంటారు. అయితే మీకు తెలుసా.. బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఒక్క సినిమాను కూడా రీమేక్ చేయలేదు. ఆయన సినిమాలనే చాలా మంది ఇతర భాషలకు చెందిన హీరోలు రీమేక్ చేశారు. సక్సెస్ సాధించారు. ఇక బాలయ్య 17 సినిమాల్లో డ్యుయల్ రోల్‌లో కనిపించారు. అలాగే అధినాయకుడు మూవీలో మూడు పాత్రల్లో నటించారు.
1987లో బాలకృష్ణ నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజ్ అవడం విశేషం. ఇక అవన్నీ హిట్ కావడం మరో విశేషం. ఇక బాలకృష్ణ నటించిన 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. అలాగే బాలయ్య ఇప్పటి వరకు 6 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 3 నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సినిమాల గురించి ఫ్యాన్స్ మళ్లీ చర్చించుకుంటున్నారు. ఇక బాలకృష్ణ త్వరలోనే అఖండ 2 తో మన ముందుకు రానున్నారు. ఆయన రీసెంట్‌గా నటించిన డాకు మహారాజ్‌బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.